సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF పలు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామ్-LDCE ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 1314 పోస్టుల్ని ప్రకటించింది సీఐఎస్ఎఫ్. నియామక ప్రక్రియ పూర్తయ్యేనాటికి ఖాళీల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ cisf.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు. లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామ్-LDCE ద్వారా ఎంపిక చేసేందుకు జారీ చేసిన నోటిఫికేషన్ కాబట్టి ఇప్పటికే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నవారు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 9 చివరి తేదీ. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం ఖాళీలు- 1314
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 9
పరీక్ష తేదీ- 2020 ఫిబ్రవరి 16
వయస్సు- 2019 ఆగస్ట్ 1 నాటికి 35 ఏళ్లు.
విద్యార్హత- డిగ్రీ.
అనుభవం- 2019 ఆగస్ట్ 1 నాటికి ఐదేళ్లు కానిస్టేబుల్-జీడీ, హెడ్ కానిస్టేబుల్-జీడీ, కానిస్టేబుల్-టీఎంగా పనిచేసిన అనుభవం ఉండాలి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Railway Jobs: గుడ్ న్యూస్... తెలుగు రాష్ట్రాల్లో 4103 రైల్వే పోస్టుల భర్తీ... వివరాలివే
Indian Navy: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో 2,700 జాబ్స్... నేటి నుంచి అప్లికేషన్స్
BEL Recruitment 2019: మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు... వివరాలివే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.