Home /News /jobs /

CISF CONSTABLE RECRUITMENT 2022 CENTRAL INDUSTRIAL SECURITY FORCE RELEASED JOB NOTIFICATION FOR 1149 CONSTABLE POSTS KNOW HOW TO APPLY SS

Constable Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్... 1149 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Constable Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్... 1149 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
(ప్రతీకాత్మక చిత్రం)

Constable Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్... 1149 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)

Constable Jobs 2022 | కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అలర్ట్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశవ్యాప్తంగా 1149 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1149 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నక్సల్స్ ఏరియాతో పాటు రాష్ట్రం మొత్తంలో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా సీఐఎస్ఎఫ్ భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 4 చివరి తేదీ. ఇంటర్మీడియట్ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అప్లై చేయడానికి ముందు జాబ్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలతో పాటు ఇతర అర్హతలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    CISF Constable Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...









































































































































     మొత్తం ఖాళీలు 1149
     తెలంగాణ 30
     ఆంధ్రప్రదేశ్ 79
     అరుణాచల్ ప్రదేశ్ 9
     అస్సాం 103
     బీహార్ 123
     చండీగఢ్ 1
     చత్తీస్‌గఢ్ 40
     ఢిల్లీ 10
     గోవా 1
     గుజరాత్ 34
     హర్యానా 14
     హిమాచల్ ప్రదేశ్ 4
     జమ్మూ అండ్ కాశ్మీర్ 41
     జార్ఖండ్ 87
     కర్నాటక 34
     కేరళ 40
     లడఖ్ 1
     మధ్యప్రదేశ్ 50
     మహారాష్ట్ర 70
     మణిపూర్ 24
     మేఘాలయ 13
     మిజోరామ్ 5
     నాగాల్యాండ్ 7
     ఒడిషా 58
     పుదుచ్చెరి 1
     పంజాబ్ 16
     రాజస్తాన్ 39
     తమిళనాడు 41
     త్రిపుర 15
     ఉత్తరప్రదేశ్ 112
     ఉత్తరాఖండ్ 6
     పశ్చిమ బెంగాల్ 54

    Jobs in Vizag Steel: వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    CISF Constable Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 29

    దరఖాస్తుకు చివరి తేదీ- 2022 మార్చి 4

    విద్యార్హతలు- ఇంటర్మీడియట్ పాస్ కావాలి

    వయస్సు- 18 నుంచి 23 ఏళ్లు

    శారీరక ప్రమాణాలు- ఎత్తు 170 సెంటీమీటర్లు, చెస్ట్ 80 నుంచి 85 సెంటీమీటర్లు

    ఎంపిక విధానం- ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్

    వేతనం- లెవెల్ 3 వేతనం వర్తిస్తుంది. రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం లభిస్తుంది.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... ఈ తప్పు చేస్తే జీవితంలో రైల్వే ఉద్యోగం రాదు

    CISF Constable Recruitment 2022: దరఖాస్తు విధానం


    Step 1- అభ్యర్థులు ముందుగా https://cisfrectt.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో Login పైన క్లిక్ చేయాలి.

    Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 4- పేరు, పుట్టిన తేదీ ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 5- అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

    Step 6- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి బద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Central Government Jobs, CISF, Govt Jobs 2022, Job notification, JOBS, Police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు