హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

విద్యార్థులకు అలర్ట్.. CICSE పరీక్షల షెడ్యూల్ లో మార్పులు.. పూర్తి వివరాలివే

విద్యార్థులకు అలర్ట్.. CICSE పరీక్షల షెడ్యూల్ లో మార్పులు.. పూర్తి వివరాలివే

 ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలలో అసైన్‌మెంట్ల ద్వారా విద్యార్థులకు మార్కులను అంచనా వేస్తారని అధికారులు తెలిపారు.

 ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలలో అసైన్‌మెంట్ల ద్వారా విద్యార్థులకు మార్కులను అంచనా వేస్తారని అధికారులు తెలిపారు.

ఇటీవల సీబీఎస్ఈ బోర్డు 10, 12 బోర్డు పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తూ రివైజ్డ్ షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐసీఎస్ఈ) సైతం 10, 12 తరగతుల పరీక్షల తేదీలను రీ షెడ్యూల్ చేసింది.

ఇంకా చదవండి ...

ఇటీవల సీబీఎస్ఈ బోర్డు 10, 12 బోర్డు పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తూ రివైజ్డ్ షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐసీఎస్ఈ) సైతం 10, 12 తరగతుల పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను సోమవారం బోర్డు విడుదల చేసింది. పలు కారణాల రిత్యా 10వ తరగతి ఎగ్జామ్స్ ను మే 13, 15 తేదీల్లో నిర్వహించబోమని సీఐసీఎస్ఈ తెలిపింది.

పదవ తరగతి షెడ్యూల్ లో మార్పులు

10వ తరగతి పరీక్షల్లో మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి. మే 13న జరగాల్సిన (ఎకనామిక్స్ గ్రూప్-2 ఎలెక్టివ్) పరీక్షా మే 4వ తేదీన జరుగుతుందని తెలిపింది. మే 15న గతంలో విడుదలైన షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్న ఆర్ట్ పేపర్-2(నేచర్ డ్రాయింగ్, పెయింటింగ్) పరీక్షను వాయిదా వేశారు. ఈ పరీక్ష మే 22న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్ట్ పేపర్-3(ఒరిజినల్ కంపోజిట్), ఆర్ట్ పేపర్-4 (అప్లైడ్ ఆర్ట్) పరీక్షలు ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం మే 22, మే 29 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే ఆ పరీక్షలను మే 29, జూన్ 5కు వాయిదా వేశారు.

12 తరగతి పరీక్షా తేదీల్లో మార్పులు

ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (ఐఎస్‌సీ) వెల్లడించిన రివైజ్డ్ టైమ్ టేబుల్ ప్రకారం.. ముందుగా వెల్లించిన షెడ్యూల్ ప్రకారం మే 5న బిజినెస్ స్టడీస్ పరీక్ష జరగాల్సి ఉంది. ఈ పరీక్షను జూన్ 18కి వాయిదా వేశారు. మే 13న జరగాల్సి ఉన్న ఇంగ్లిష్ పేపర్2ను మే 4కు, జూన్ 2న జరగాల్సి ఉన్న ఆర్ట్ పేపర్5ను మే 5కు, మే 15న జరగాల్సి ఉన్న హోమ్ సైన్స్(పేపర్ 1)ను మే 22కు, జూన్5న జరగాల్సి ఉన్న ఆర్ట్ పేపర్ 4ను జూన్ 2కు, జూన్ 8న జరగాల్సి ఉన్న హాస్పటాలిటీ మేనేజ్మెంట్ పరీక్షను జూన్ 5కు, జూన్ 10న జరగాల్సి ఉన్న బయోటెక్నాలజీ(పేపర్ 1) పరీక్షను మే 8న, జూన్ 12న నిర్వహించాల్సి ఉన్న ఆర్ట్ పేపర్ 1 పరీక్షను మే 12న నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: 10th Class Exams, CBSE Board Exams 2021, Exams

ఉత్తమ కథలు