ICSE, ISC Result 2020: ఐసీఎస్‌ఈ 10వ, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేయండి ఇలా

ISC and ICSE 2020 Result | ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 10, 2020, 3:05 PM IST
ICSE, ISC Result 2020: ఐసీఎస్‌ఈ 10వ, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేయండి ఇలా
ICSE, ISC Result 2020: ఐసీఎస్‌ఈ 10వ, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
CISCE ICSE 10th, ISC 12th Result 2020 LIVE | ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్-CISCE. ఈ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రిజల్ట్స్ వచ్చేశాయి. ఐసీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్స్ అయిన https://www.cisce.org/ లేదా https://results.cisce.org/ ఓపెన్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

ముందుగా ఐసీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్స్ https://www.cisce.org/ లేదా https://results.cisce.org/ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో ఫలితాలకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయాలి. లేదా Course ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత యూనిక్ ఐడీ, ఇండెక్స్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఫలితాల కాపీని ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలను ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఐసీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులు ICSE<Space><Unique Id>, ఐఎస్‌సీ 12వ తరగతి విద్యార్థులు ISC<Space><Unique Id> అని టైప్ చేసి 09248082883 నెంబర్‌కు మెసేజ్ పంపాలి. ఫలితాలపై ఏవైనా సందేహాలు ఉంటే ciscehelpdesk@orioninc.com ఇమెయిల్ ఐడీ లేదా 1800-267-1760 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.
Published by: Santhosh Kumar S
First published: July 10, 2020, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading