CIPET Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. CIPETలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కరోనా ప్రభావంతో ఆగిపోయిన వివిధ నియామకాలు ఇప్పుడు వైరస్ వ్యాప్తి తగ్గడంతో మళ్లీ ఉపందుకున్నాయి. పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. DRDO, ISRO లాంటి పలు ప్రముఖ సంస్థలు ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. తాజాగా సెంట్రల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(CIPET) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సూచించిన ఫార్మాట్లో “Sr. Officer (Admin./HR), CIPET Head Office, T.V.K. Industrial Estate, Guindy, Chennai – 600 032” చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు జులై 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా పై చిరునామాకు తమ దరఖాస్తులు చేరేలా పంపించాల్సి ఉంటుంది.
    BECIL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. BECILలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్

    ఖాళీల వివరాలు..
    టెక్నీకల్ విభాగంలో ఐదు ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. చీఫ్ మేనేజర్(టెక్నికల్/అసోసియేట్ ప్రొఫెసర్) పోస్టులు ఇందులో ఉన్నాయి. నాన్ టెక్నికల్ విభాగంలో మరో మూడు ఖాళీలు ఉన్నాయి. ఇందులో పోస్టుల వారీగా చీఫ్ మేనేజర్(పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్), చీఫ్ మేనేజర్(ఫైనాన్స్ & అకౌంట్స్) 1, మేనేజర్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్) 1 ఖాళీ ఉంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Notification & Application Forms - Direct Link

    వయస్సు: ఈ ఉద్యోగాలకు వయో పరిమితిగా 45 ఏళ్లను నిర్ణయించారు. ఆ వయస్సు లోపు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

    ఇదిలా ఉంటే.. కరోనా పరిస్థితులు, వరుస లాక్‌డౌన్‌ల నేపథ్యంలో చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌ (సీఈఏ) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి అలవెన్స్‌ క్లైమ్‌ కోసం వ్యక్తిగత సర్టిఫికేషన్‌కు అనుమతించాలని నిర్ణయించింది. దీని వల్ల 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌ క్లైమ్‌ చేయడానికి ఉద్యోగులు ఇబ్బందులుపడేవారు. ఇప్పుడు వారంతా వ్యక్తిగత సర్టిఫికేషన్‌కు అవకాశం ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.

    ఈ మేరకు కేంద్రం ఆఫీసు మెమోరాండం విడుదల చేసింది. దేశంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ వల్ల పిల్లల రిపోర్ట్‌ కార్డులు, రిజల్ట్స్‌ వంటివి ఇంటికి రావడం లేదు. దాంతోపాటు ఫీజులు కూడా ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్న పరిస్థితి. దీంతో అలవెన్స్‌ కోసం అప్లై చేయడానికి డాక్యమెంట్స్‌ లాంటివి ఏవీ ఉండటం లేదు. ఈ విషయాన్ని పలువురు ఉద్యోగులు ఆయా డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ల ద్వారా ప్రభుత్వానికి చేరవేశారు. దీనిపై ఆలోచించిన ప్రభుత్వం... ఈ మేరకు వ్యక్తిగత సర్టిఫికేషన్‌కు అవకాశం ఇచ్చింది.
    Published by:Nikhil Kumar S
    First published: