Home /News /jobs /

CIL RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR 1050 MANAGEMENT TRAINEE VACANCIES TODAY JULY 22 IS LAST DATE FOR APPLICATIONS NS

Central Govt Jobs 2022 : నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు కోల్ ఇండియా (Coal India) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజు అంటే జులై 22 లాస్ట్ డేట్.

    ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన కోల్ ఇండియా (Coal India) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Coal India Job Notification) విడుదల చేసింది. మొత్తం 1050 మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మైనింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యనికేషన్ సిస్టం అండ్ EDP విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సంబంధిత విభాగాల్లో గేట్ స్కోర్ (GATE 2022) కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు (Jobs) అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 23న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సాధించిన గేట్ స్కోర్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు..



























    విభాగంఖాళీలు
    మైనింగ్699
    సివిల్160
    ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్124
    సిస్టం అండ్ ఈడీపీ67
    మొత్తం:1050

    Mining: ఈ విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మైనింగ్ లో బీఈ/బీటెక్/బీఎస్సీ చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి.
    CIVIL: సివిల్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్: ఈ విభాగంలో బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
    సిస్టం అండ్ ఈడీపీ: కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన వారు లేదా ఎంసీఏ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు పొంది ఉండాలి.
    AP Mega Job Mela: ఏపీలో నేడు భారీ జాబ్ మేళా.. 1000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే..



    వయస్సు: అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి.
    వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం ఉంటుంది.
    అభ్యర్థులు ఈ లింక్  ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు. 
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS

    తదుపరి వార్తలు