CIL RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 1050 MANAGEMENT TRAINEE VACANCIES HERE DETAILS NS
CIL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగులకు కోల్ ఇండియా (Coal India) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన కోల్ ఇండియా (Coal India) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Coal India Job Notification) విడుదల చేసింది. మొత్తం 1050 మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మైనింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యనికేషన్ సిస్టం అండ్ EDP విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సంబంధిత విభాగాల్లో గేట్ స్కోర్ (GATE 2022) కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు (Jobs) అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 23న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సాధించిన గేట్ స్కోర్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
విభాగం
ఖాళీలు
మైనింగ్
699
సివిల్
160
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్
124
సిస్టం అండ్ ఈడీపీ
67
మొత్తం:
1050
Mining: ఈ విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మైనింగ్ లో బీఈ/బీటెక్/బీఎస్సీ చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. CIVIL: సివిల్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్: ఈ విభాగంలో బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సిస్టం అండ్ ఈడీపీ: కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన వారు లేదా ఎంసీఏ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు పొంది ఉండాలి. Mega Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
వయస్సు: అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థులు ఈ లింక్ ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.