హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Electing Your Major: ఉన్నత విద్యకు యూఎస్‌ వెళ్తున్నారా? మేజర్‌ సబ్జెక్ట్‌ ఎంచుకోవడంపై నిపుణుల సూచనలివే

Electing Your Major: ఉన్నత విద్యకు యూఎస్‌ వెళ్తున్నారా? మేజర్‌ సబ్జెక్ట్‌ ఎంచుకోవడంపై నిపుణుల సూచనలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విద్యార్ధులు యూఎస్‌లో హైయర్‌ ఎడ్యుకేషన్‌కు(Higher Education) సిద్ధమవుతున్న సమయంలో మేజర్‌ సబ్జెక్ట్‌(Major Subject)ను ఎంచుకోవడం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ.

విద్యార్ధులు యూఎస్‌లో హైయర్‌ ఎడ్యుకేషన్‌కు (Higher Education) సిద్ధమవుతున్న సమయంలో మేజర్‌ సబ్జెక్ట్‌ (Major Subject)ను ఎంచుకోవడం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఏ సబ్జెక్ట్‌ ఆసక్తి కలిగిస్తుంది? నాలుగు సంవత్సరాలలో ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నారు? మేజర్‌ సబ్జెక్ట్‌ మీ కెరీర్‌కు (Career) ఎలా ఉపయోగపడుతుంది? అనే ప్రశ్నలను విద్యార్థులు తరచూ ఎదుర్కొంటారు. డ్రాయింగ్ లేదా థియేటర్‌పై ఇంట్రెస్ట్‌ ఉంటే ఆర్ట్‌ లేదా డ్రామాను మేజర్‌గా ఎంచుకొనే అవకాశం ఉంది. లా లేదా మెడిసిన్ చదవాలని అనుకుంటే.. లా స్కూల్ లేదా మెడికల్ స్కూల్‌లోకి ప్రవేశించేందుకు సహాయపడే మేజర్‌ను ఎంచుకోవాలి. చాలా కళాశాలలు తమ అప్లికేషన్‌లో మేజర్‌ను పేర్కొనమని కోరుతాయి. మేజర్‌ను నమోదు చేయకుండా ఉండే సదుపాయం కూడా ఉంది. మొదటి, రెండవ సంవత్సరం కోర్సులో వివిధ సబ్జెక్టులను అన్వేషించడం, సాధారణ కోర్సులను తీసుకోవడం పూర్తిగా సహజం. ఇది వివిధ విషయాలలో ప్రాథమిక పరిచయాన్ని పొందడానికి విద్యార్థులకు సహాయపడుతుంది. ప్రధాన ఎంపికపై పట్టు సాధించేందుకు వీలు కల్పిస్తుంది. మేజర్‌ విషయంలో మీరు తీసుకొన్న నిర్ణయానికి కచ్చితంగా కట్టుబడాల్సిన నిబంధన లేదు.. కళాశాల లేదా వర్సిటీలో చేరిన తర్వాత, అడ్వైజర్‌ను సంప్రదించి మేజర్‌ని మార్చుకొనే సౌలభ్యం ఉంది.

మేజర్‌ను డిక్లేర్‌కు చేయడానికి ముందు వర్సిటీల కోసం సెర్చ్‌ చేస్తున్న సమయంలో మేజర్‌ను ఎంపిక చేసుకొనేందుకు యునైటెడ్ స్టేట్స్‌కు వచ్చే ముందు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సెంటర్స్‌లోని అడ్వైజర్‌లతో, యూనివర్సిటీలోని అకడమిక్ అడ్వైజర్‌లతో మాట్లాడండి. చివరికి ఏది ఎంచుకున్నా, మీ మేజర్‌ని ప్రేమించండి అని ఎడ్యుకేషన్ USA సలహాదారు ఆస్తా విర్క్ సింగ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Career and Courses: విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. వ‌చ్చే ఏడాది నుంచి కొత్త కోర్సు.. పాత కోర్సుల రద్దు

మేజర్‌ని సెలక్ట్‌ చేసుకొనేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలు ఏంటి?

కాలేజ్‌ కోర్సులో ఓ సబ్జెక్ట్‌పై పూర్తిగా పట్టుసాధించేందుకు ఎంచుకొనే సబ్జెక్ట్‌ను మేజర్‌గా పేర్కొంటారు. కోర్సులను పూర్తి చేసిన తర్వాత మేజర్‌ సబ్జెక్ట్‌పైనే గ్రాడ్యుయేషన్‌ చేస్తారు. చాలా మంది విద్యార్థులు నాలుగు సంవత్సరాల విద్య మొదటి లేదా రెండవ సంవత్సరంలో జనరల్‌ ఎడ్యుకేషన్‌ రిక్వైర్‌మెంట్స్‌ తీసుకుంటారు. దీంతో ప్రపంచం గురించి అవగాహన పొందుతారు.

Scholarships: ఉన్నత విద్య కోసం అందుబాటులో స్కాలర్‌షిప్స్.. ఈ నెలలో అప్లై చేసుకోవాల్సినవి ఇవే..

కొంతమంది విద్యార్థులు తమ మేజర్‌తో పాటు మైనర్‌ను కూడా ఎంచుకోవచ్చు. మైనర్ అనేది మరొక ఫీల్డ్‌ని అన్వేషించే కోర్సు వర్క్, అయితే మేజర్‌ సబ్జెక్ట్‌ అంత లోతుగా విస్తృతంగా అధ్యయనం చేయరు. ఉదాహరణకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మైనర్‌, పబ్లిక్ రిలేషన్స్‌లో మేజర్ తీసుకోవచ్చు. కొన్ని కాలేజ్‌లు రెండు మేజర్‌లను పూర్తి చేసే అవకాశం కూడా కల్పిస్తాయి. ఇలాంటి ఆప్షన్స్‌ తీసుకొంటే పనిభారం పెరుగుతుంది.

-మేజర్‌ని ఎంచుకున్నప్పుడు విద్యార్థులు తమను తాము ప్రశ్నించుకోవాల్సినవి..

ఎలాంటి జీవితాన్ని ఊహించారు?

-ఎక్కడ పనిచేస్తారని భావిస్తున్నారు?

-మీ విలువలు ఏంటి, మిమ్మల్ని ఏది ప్రేరేపిస్తుంది, మీకు ఏది ముఖ్యం, మీ ప్రాధాన్యం దేనికి?

-మీ విద్యాపరమైన బలాలు ఏంటి? ఎందులో మంచి గ్రేడ్‌లను సాధిస్తున్నారు? ఏ సబ్జెక్టులను నేర్చుకోవడానికి ఇష్టపడతారు? మీకు ఇష్టమైన తరగతులు ఏవి?

-మీరు కాలేజ్‌ లేదా కాలేజ్‌ బయట ఏ కార్యకలాపాలను ఆనందిస్తారు?

మీ బాగా ఏమి చేయగలరు, మీ ఏమి చేయాలనుకుంటున్నారు, మీకు ఏది ముఖ్యమైనది వంటి అంశాలను అంచనా వేయడం ద్వారా మీరు అనుసరించడానికి ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌లను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడతాయి.

కోర్సు ప్రారంభంలోనే మేజర్‌ను ఎంచుకోకపోతే ఇబ్బందా?

ఏం చదువుకోవాలనుకుంటున్నారో లేదా కెరీర్ పరంగా ఎక్కడికి వెళుతున్నారో తెలియకపోవడం మంచిదే. అయితే విద్యార్థులు కొన్నిసార్లు ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడే కీలకమైన సమాచారాన్ని పరిశోధించడం, సేకరించడం వంటివి చేయడంలో వెనకబడతారు అది మంచిది కాదు. చాలా మంది విద్యార్థులు సబ్జెక్టును ఎంచుకోవడంలో విపరీతమైన ఒత్తిడిని అనుభవిస్తారు, కొన్నిసార్లు తొందరపడి నిర్ణయం తీసుకుంటారు. చాలా మంది విద్యార్థులు U.S. యూనివర్శిటీలకు మేజర్‌ను నిర్ణయించుకోలేదని పేర్కొంటూ దరఖాస్తు చేసుకుంటారు, ఒక సంవత్సరం తర్వాత వారి చివరి మేజర్‌ని నిర్ణయించుకుంటారు.

భారతీయ విద్యార్థులకు ఎక్కువగా ఎంచుకొన్న మేజర్‌లు ఏవి?

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ప్రచురించిన 2021 ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం..

ఇంజినీరింగ్, గణితం, కంప్యూటర్ సైన్స్, బిజినెస్‌, మేనేజ్‌మెంట్‌, సోషల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఫైన్‌ అండ్‌ అప్లైడ్‌ ఆర్ట్స్‌, హెల్త్‌ ప్రొఫెషన్స్‌, కమ్యునికేషన్స్‌ అండ్‌ జర్నలిజమ్‌, ఎడ్యుకేషన్‌ వంటి మేజర్‌లను భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఎంచుకొన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో భారతీయ విద్యార్థులు 18 శాతం ఉన్నారు.

మేజర్‌ని ఎంచుకొనే సమయంలో విద్యార్థులు వేటికి దూరంగా ఉండాలి?

మేజర్‌ను ఎంచుకోవడం అనివార్యమైంది, తరచుగా సవాలు చేసే నిర్ణయం. దీర్ఘకాలికంగా ఆలోచించకుండా.. జీతం లేదా ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదు. తోటివారి ఒత్తిడికి లొంగిపోవడం లేదా గుంపును అనుసరించడం చేయకూడదు.

మిమ్మల్ని ప్రభావితం చేయడానికి మరొకరిని అనుమతించడం లేదా మీ కోసం ఎంచుకోవద్దు. అనుభవం లేకుండా రీసెర్చ్‌ చేయకుండా మేజర్‌ను సెలక్ట్‌ చేసుకోకూడదు. ప్రయాణం గురించి కాకుండా ఫలితం గురించి మాత్రమే ఆలోచించి నిర్ణయం తీసుకోకూడదు.

యూఎస్‌ వర్సిటీలోకి ప్రవేశించే ముందు, చేరిన తర్వాత మేజర్‌ని ఎంచుకోవడంపై ఎవరిని సంప్రదించవచ్చు?

విద్యార్థులు తమకు తాముగా రీసెర్చ్‌ చేసి లేదా మెంటర్లు, స్కూల్ కౌన్సెలర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహాయంతో మేజర్‌ని ఎంచుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. ప్రొఫెషనల్స్‌ సాయంతో ఆప్టిట్యూడ్, ఆసక్తులు, వ్యక్తిత్వాన్ని కొలిచే సైకోమెట్రిక్ పరీక్షల ద్వారా కూడా కెరీర్ ఆప్షన్‌లను ఎంపిక చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో పరీక్ష తీసుకోవడం సరిపోదని గమనించాలి. పరీక్ష ఫలితాల విశ్లేషణ, నిపుణుల మార్గదర్శకత్వం పొందడం ద్వారా ప్రక్రియను పూర్తి చేయాలి. కెరీర్‌లు, జాబ్ మార్కెట్‌లలో ట్రెండ్‌లను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మేజర్‌లు, కెరీర్‌, ఉద్యోగ అవకాశాలపై సమాచారాన్ని అందించేందుకు యూఎస్‌లో కొన్ని సంస్థలు ఉన్నాయి.

EducationUSA అనేది యూఎస్‌ ఉన్నత విద్యను పర్యవేక్షిస్తుంది. EducationUSA అడ్వైజర్‌లు విద్యార్థులకు ప్రవేశాలు, దరఖాస్తు ప్రక్రియపై సమాచారాన్ని అందిస్తారు. U.S. యూనివర్సిటీలలో మేజర్‌, ప్రోగ్రామ్‌లపై సలహాలు ఇస్తారు. ఆయా కాలేజ్‌లలో కౌన్సెలర్‌లు, ప్లేస్‌మెంట్ అధికారులు, కెరీర్ కౌన్సెలింగ్‌లో నైపుణ్యం కలిగిన కెరీర్ కౌన్సెలర్లు.. కళాశాల, కెరీర్ నిర్ణయాలు తీసుకోవడంలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. లైబ్రరీలు, కెరీర్ గైడెన్స్ సెంటర్‌లు కూడా విద్యార్థులకు ఉపయోగపడతాయి.

ఈ స్టోరీ మొదట స్పాన్ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది.

First published:

Tags: EDUCATION, Higher education

ఉత్తమ కథలు