హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

China Education System: విద్యలో చైనా వెనుకే అమెరికా.. అగ్రరాజ్యం ఎందుకు వెనుకబడుతోంది?

China Education System: విద్యలో చైనా వెనుకే అమెరికా.. అగ్రరాజ్యం ఎందుకు వెనుకబడుతోంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనా విద్యార్థులు అమెరికా విద్యార్థుల కంటే ముందు ఉన్నట్లు తాజా సర్వే తేల్చి చెప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యా విధానంలో ఒక్కో దేశం ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంది. కొన్ని దేశాల్లో వైవిద్యమైన విద్యా వ్యవస్థ అమల్లో ఉంటుంది. అయితే ఈ తరం విద్యా వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుంటే.. చైనా విద్యార్థులు అమెరికా విద్యార్థుల కంటే ముందు ఉన్నట్లు తాజా సర్వే నిర్ధారించింది. ప్రపంచంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రామ్‌ ఫర్‌ ఇంటర్నేషన్‌ల్‌ స్టూడెంట్‌ అసెస్‌మెంట్‌ (పిసా) అనే టెస్ట్‌ నిర్వహిస్తూ ఉంటుంది. 2018కి సంబంధించిన టెస్ట్‌ వివరాలు తాజాగా బయటికొచ్చాయి. అందులో అమెరికా విద్యార్థులను చైనా విద్యార్థులు దాటేశారు. 79 దేశాల్లోని 15 ఏళ్లు వయసున్న ఆరు లక్షల మందిపై ఈ టెస్ట్‌ నిర్వహించారు. రీడింగ్‌, గణితం, సైన్స్‌ స్కిల్స్‌పై విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. ఇందులో అన్ని అంశాల్లో చైనా విద్యార్థులు తొలి స్థానంలో నిలవడం విశేషం. ఈ టెస్టులో సామాజిక, ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకున్నారు.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... డీఏ చెల్లింపులపై డిసైడ్ చేసేది ఆరోజే

పరీక్ష ఫలితాల్లో చైనాలో బీజింగ్‌, షాంఘై, జియాంగ్‌సు, జెజియాంగ్‌ ప్రావిన్స్‌ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వారికి మూడు కేటగిరీల్లోనూ నాలుగు రేటింగ్‌ వచ్చింది. అదే అమెరికాలో అయితే రీడింగ్‌, సైన్స్‌లో విద్యార్థులు లెవల్ 3, మ్యాథ్స్‌లో లెవల్‌ 2 వచ్చాయి. చాలా దేశాలు విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడానికి గత రెండు దశాబ్దాలుగా చాలా రకాలు ప్రయత్నాలు చేస్తున్నా, సాధ్యపడటం లేదని పీసా నివేదిక తెలిపింది. గత దశాబ్దం లెక్కలు తీసుకుంటే వ్యయాన్ని 15 శాతం మేర పెంచాయి. 2000 నుంచి చూస్తే ఇప్పటివరకు ఓఈసీడీ దేశాల్లో మార్పు కనిపించకపోవడం దురదృష్టకరమని నివేదికలో పేర్కొన్నారు.

విద్యా వ్యవస్థ పనితనం దేశాల ఆర్థిక పరిస్థితిపై కూడా ఆధారపడి ఉంటుందని పీసా పరీక్షలో తేలింది. విద్యార్థుల ఆర్థిక పరిస్థితి, వారి విద్యపై ప్రభావం చూపుతుందని చాలామంది భావిస్తారు. కానీ చైనాలో పేద విద్యార్థులు కూడా చక్కగా రాణిస్తున్నారని పీసా టెస్ట్‌ నిరూపించింది. అమెరికా లాంటి దేశాల్లో 20 శాతం మంది విద్యార్థులకు చదవడం సరిగ్గా రావడం లేదట. 2000లో కూడా ఈ శాతం ఇంతే ఉండటం గమనార్హం. అక్కడ కేవలం 14 శాతం మంది మాత్రమే సరిగ్గా చదవగలుగుతున్నారట. దీంతో అమెరికాలో విద్యాభ్యాసం కోసం చేస్తున్న ఖర్చు ఉపయోగం లేకుండా పోతోందని చెబుతున్నారు. విద్యార్థులు అలా అవ్వడానికి కారణం టెక్నాలజీ అని అంటోంది పీసా టెస్ట్.

గతంలో ప్రభుత్వం అందించిన పుస్తకాలను చదివి విషయం, అర్థాలు తెలుసుకునేవారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పేరుతో అంతర్జాలంలో దొరికిన సమాచారాన్ని చదివేస్తున్నారు. దీని వల్ల అందులో దొరికిన సమాధానం నిజమైనదా, కాదా అనేది తెలుసుకోవడం లేదు. ప్రస్తుతం గూగుల్‌లో చూస్తే ఒక్కో ప్రశ్నకు చాలా సమాధానాలు దొరుకుతాయి. అందులో ఏది కరెక్ట్‌ అనేది తెలియక.. కనిపించింది చదివి నేర్చుకుంటున్నారట. దీంతో టెక్నాలజీని ఎల్లప్పుడూ నమ్మొద్దని సూచిస్తున్నారు నిపుణులు. విద్యా వ్యవస్థ... ఆ దేశ భవిష్యత్తు ఆర్థిక సత్తాను నిర్ణయింస్తుందంటారు. అందుకే విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అది కూడా టెక్నాలజీ వినియోగాన్ని తగ్గించి అనేది ఈ టెస్ట్‌ సారాంశం అని చెప్పుకోవచ్చు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: America, China

ఉత్తమ కథలు