CHILDREN WHO HAVE LOST PARENTS DURING COVID 19 SHOULD BE GIVEN FREE EDUCATION IN SOME SCHOOLS DELHI GOVT NS GH
Orphans: కరోనాతో పేరెంట్స్ ను కోల్పోయిన చిన్నారులకు అండగా సర్కార్.. కీలక ఉత్తర్వులు జారీ
ప్రతీకాత్మక చిత్రం
గతేడాది మార్చి తర్వాత అనాథలుగా మారిన లేదా తండ్రి/తల్లిని కోల్పోయిన విద్యార్థులకు ఉచిత విద్యను అందించనున్నట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. వీరిని యధావిధిగా అదే పాఠశాలలో కొనసాగిస్తూ ఉచిత విద్యను అందించాలని దేశ రాజధానిలోని పాఠశాలలకు ఆదేశించింది.
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులను కోల్పోవడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గతేడాది మార్చి తర్వాత అనాథలుగా మారిన లేదా తండ్రి/తల్లిని కోల్పోయిన విద్యార్థులకు ఉచిత విద్యను అందించనున్నట్లు ప్రకటించింది. వీరిని యధావిధిగా అదే పాఠశాలలో కొనసాగిస్తూ ఉచిత విద్యను అందించాలని దేశ రాజధానిలోని పాఠశాలలను ఆదేశించింది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(డీడీఏ) లేదా ప్రభుత్వం కేటాయించిన స్థలాలలో నడిచే ప్రైవేట్ పాఠశాలలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. "కోవిడ్ -19 లేదా ఇతర కారణాల వల్ల మార్చి 2020 తర్వాత అనాథలుగా మారిన లేదా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు పాఠశాలలో నిరంతరాయంగా విద్యను అభ్యసించాలి. ఇందుకు, తగిన శ్రద్ధ తీసుకోవడం అత్యవసరమని అన్ని జిల్లాలకు ఆదేశించాం" అని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (DoE) అధికారిక ఆదేశాల్లో పేర్కొన్నారు. Telangana: తెలంగాణలో ముగిసిన కరోనా సెకండ్ వేవ్.. వైద్యఆరోగ్యశాఖ ప్రకటన AP Schools New Timings: ఏపీలో స్కూళ్ల టైమింగ్స్ లో మార్పులు... కొత్త టైమ్ టేబుల్ ఇదే..!
డీడీఏ లేదా ప్రభుత్వం కేటాయించిన భూస్థలాల్లో ఫ్రీషిప్ కింద నడుస్తున్న పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నట్లయితే.. వారు అనాథలుగా మారిన తర్వాత కూడా అదే పాఠశాలలో చదువు కొనసాగించడానికి సమర్థ అధికార ఆమోదంతో సర్దుబాటు చేస్తామని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. ఎకనామికల్లీ వీక్ సెక్షన్ డిస్అడ్వాంటేజెడ్ గ్రూపు కేటగిరీ కింద చదువుతున్న విద్యార్థులుగా అనాథ విద్యార్థులను పరిగణించవచ్చని.. రీయింబర్స్‌మెంట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా అందించవచ్చని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. 8వ తరగతి తర్వాత విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కల్పించవచ్చని వెల్లడించింది.
ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఢిల్లీలో వైరస్ వ్యాప్తి చెందిన సమయం నుంచి దాదాపు 5,500 మంది పిల్లలు తమ తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోయారు. కోవిడ్-19 సమయంలో అనాథలైన 268 మంది పిల్లలను ఈ డిపార్ట్మెంట్ గుర్తించింది. కరోనా కాలంలో అనాథలుగా మారిన పిల్లల విద్య, పోషణకు అయ్యే ఖర్చును తమ ప్రభుత్వం భరిస్తుందని మే 14న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.