ఒక పెద్ద FMCG కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో వోలటాలిటీ (Volatility), అన్సర్టెనిటీ (Uncertainty), కాంప్లెక్సిటీ (Complexity), యాంబిగ్విటీ (Ambiguity)- VUCA కాన్సెప్ట్ గురించి తెలుసుకొన్నట్లు ఓ నిపుణుడు తెలిపారు. దాని మీద లోతైన పరిశోధన చేసిన తర్వాత, యూఎస్ సైన్యం(Army) ప్రచ్ఛన్న యుద్ధం ముగిసే సమయంలో VUCA కాన్సెప్ట్‌ను ఉపయోగించినట్లు తెలిసిందన్నారు. ఈ కాన్సెప్ట్ మేనేజ్మెంట్, లీడర్‌షిప్‌పై కూడా ప్రభావం చూపిందని వివరించారు. అయితే ఇది చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువును ప్లాన్ చేయడంలో ఎదుర్కొనే సవాళ్లను ప్రతిబింబిస్తుందన్నారు. తల్లిదండ్రులు VUCA కాన్సెప్ట్ గురించి అడగాల్సిన ప్రశ్నలను వివరించారు.
నా బిడ్డకు CBSE/ ICSE లేదా స్టేట్ బోర్డ్ లేదా అంతర్జాతీయ పాఠ్యాంశాలు ఏ బోర్డు బావుంటుంది? వైద్యం, లా, ఇంజినీరింగ్, క్రియేటివ్ జాబ్స్, చెఫ్ కోర్సులలో ఏది ఎంచుకొంటారు? ఏ దశ వరకు పిల్లల చదువుకు మద్దతు ఇవ్వగలం? పదవీ విరమణ వంటి ఇతర లక్ష్యాలపై రాజీ పడకుండా నిజంగా ఎంత ఖర్చు చేయగలం? నా బిడ్డ భారతదేశంలో లేదా విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకొంటున్నారా?.. ఈ ప్రశ్నలతో పాటు, ఈ కాలం పిల్లలు ఏమి చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోలేకతున్నారు. అదే విధంగా వారిని బలవంతం పెట్టకూడదని నేటి తల్లిదండ్రులు భావిస్తున్నారు. విద్య కోసం ప్రణాళికను నిరంతరం స్వీకరించాల్సిన అవసరం ఉందని అర్థం. కాబట్టి, VUCA ప్రపంచంలో విద్యా లక్ష్యాలను ఎలా ప్లాన్ చేస్తారో తెలుసుకోండి.
* సాధ్యమైనంత ఉత్తమంగా విద్యా లక్ష్యాలను ఎంచుకోవాలి
విద్యా లక్ష్యాలకు సంబంధించి సరైన ప్రణాళిక ఉంటే.. ఖరీరైన విద్యను అభ్యసించే అంశాల్లో అనిశ్చితి నెలకొనదు. పెట్టుబడి వ్యూహం సమీప-కాల అనిశ్చితిని విస్మరించడంలో సహాయపడవచ్చు. VUCA రకమైన వాతావరణంలో, విద్య లక్ష్యాలు స్పష్టంగా మారుతున్నాయా? ప్రభావితం అవుతున్నాయా? మార్పు లేకుండా ఉన్నాయా? అనేదానిపై స్పష్టత వస్తుంది. ఎప్పటికప్పుడు ఇవి పరిశీలించుకోవడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. నిరంతరం వాటిని తిరిగి అంచనా వేయాలి.
* పెట్టుబడులను విస్తరించాలి
కరెన్సీ రిస్క్‌లతో సహా వివిధ రిస్క్‌లను కవర్ చేయడానికి అసెట్ క్లాస్‌లు, భౌగోళిక ప్రాంతాలలో పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలు వైవిధ్యభరితంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు చదవాలనుకుంటున్న దేశానికి సంబంధించిన కరెన్సీకి వ్యతిరేకంగా రూపాయి విలువ తగ్గితే అంతర్జాతీయ విద్య మరింత ఖరీదైనది కావచ్చు.తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొనేందుకు హెడ్జెస్ ఉపయోగించాలి. కోవిడ్ మహమ్మారి వంటి తీవ్రమైన పరిణామాల సమయంలో ఉపయోగపడుతుంది.
* అవసరాలకు డబ్బు అందుబాటులో ఉంచుకోవాలి
డబ్బే ప్రధానం అని చాలా మంది చెబుతారు. ఎందుకంటే వస్తువులు చౌకగా ఉన్నప్పుడు కొనుగోలు చేయడం ద్వారా అధిక మార్కెట్ అస్థిరత నుండి ప్రయోజనం పొందవచ్చు. అలాగే, లక్ష్యాలు సమీప భవిష్యత్తులో ఉంటే, మార్కెట్ వాతావరణం అనుకూలంగా లేకుంటే, మిగులు లిక్విడిటీని బ్రిడ్జింగ్ ఏర్పాటుగా ఉపయోగించవచ్చు. VUCA లక్ష్యాల కోసం ఇది మంచిది.
* బ్యాకప్ ప్లాన్‌ను సిద్ధంగా ఉంచుకోండి
తీవ్రమైన అస్థిరత లేదా బ్లాక్ స్వాన్ ఈవెంట్ల సమయంలో, అసలు ప్లాన్ పని చేయకపోవచ్చు. అటువంటి సమయాల్లో ప్లాన్ B సిద్ధంగా ఉండటం ఎల్లప్పుడూ అవసరం. ప్రణాళిక Bలో కొన్ని విచక్షణా పరమైన ఆర్థిక లక్ష్యాలను వాయిదా వేయడం లేదా అంతరాన్ని తగ్గించడానికి కొంత పరపతిని తీసుకోవడం వంటివి ఉండవచ్చు.
* పెట్టుబడులు పెంచాలి
కొన్నిసార్లు ప్రణాళికను మెరుగుపరచాలి. వేతన పెంపు/బోనస్‌లు లేదా విండ్‌ఫాల్ వ్యాపార ఆదాయం వంటి పెరుగుతున్న ఆదాయాలను సక్రమంగా వినియోగిస్తే లక్ష్యాల కంటే ముందుండవచ్చు. విదేశీ విద్యతో సమానమైన ప్రయోజనాలను అందించే భారతదేశంలోని కొత్త కళాశాలల్లో విద్యను పరిశీలించవచ్చు.
* అవసరాలను ముందుగా అంచనా వేయడం కష్టం
చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీల వంటి అనేక చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోడక్ట్‌లు ముందుగా నిర్ణయించిన ఫ్రీక్వెన్సీలు లేదా మెచ్యూరిటీ తర్వాత చెల్లింపులతో ఉంటాయి. అయితే విద్యకు డబ్బు ఎప్పుడు అవసరమో, ఎంత మొత్తం అవసరమో అంచనా వేయడం సవాలుగా ఉంది. లాక్-ఇన్లు లేదా ముందుగా నిర్ణయించిన చెల్లింపులు లేకుండా స్థిరమైన పథకాలను ఎంచుకోవాలి. విద్యా సలహాదారులు, ఆర్థిక సలహాదారుల నుండి విద్యా లక్ష్య ప్రణాళిక కోసం వృత్తిపరమైన సహాయం కోరడం అనేది VUCA ప్రపంచాన్ని ఎదుర్కోవటానికి మరొక వ్యూహం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Childrens day, Financial Planning, Investers