హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Trans Gender: ఖాకీ చొక్కా వేసుకోనున్న ట్రాన్స్ జెండర్లు.. ఛత్తీస్‌గఢ్‌ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం..

Trans Gender: ఖాకీ చొక్కా వేసుకోనున్న ట్రాన్స్ జెండర్లు.. ఛత్తీస్‌గఢ్‌ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం..

సమాజంలోని కట్టుబాట్ల గోడలను బద్ధలుకొడుతూ ఛత్తీస్ గఢ్ లో పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ట్రాన్స్ జెండర్లు ఏమీ చేయలేరని భావించే వాళ్లకు కొత్త అర్థం చెబుతోంది ఈ రిక్రూట్ మెంట్ ప్రక్రియ.

సమాజంలోని కట్టుబాట్ల గోడలను బద్ధలుకొడుతూ ఛత్తీస్ గఢ్ లో పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ట్రాన్స్ జెండర్లు ఏమీ చేయలేరని భావించే వాళ్లకు కొత్త అర్థం చెబుతోంది ఈ రిక్రూట్ మెంట్ ప్రక్రియ.

సమాజంలోని కట్టుబాట్ల గోడలను బద్ధలుకొడుతూ ఛత్తీస్ గఢ్ లో పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ట్రాన్స్ జెండర్లు ఏమీ చేయలేరని భావించే వాళ్లకు కొత్త అర్థం చెబుతోంది ఈ రిక్రూట్ మెంట్ ప్రక్రియ.

  సమాజంలోని కట్టుబాట్ల గోడలను బద్ధలుకొడుతూ ఛత్తీస్ గఢ్ లో పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ట్రాన్స్ జెండర్లు ఏమీ చేయలేరని భావించే వాళ్లకు కొత్త అర్థం చెబుతోంది ఈ రిక్రూట్ మెంట్ ప్రక్రియ. ఈ రాష్ట్రంలో ఏకంగా 13 మంది ట్రాన్స్ జెండర్లకు పోలీసు ఉద్యోగాలు దక్కాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఈ మేరకు వీరిని కానిస్టేబుళ్లుగా నియమిస్తూ ఛత్తీస్ గఢ్ పోలీస్ రిక్రూట్మెంట్ సాగటం హైలైట్. దేశంలో ఇలా జరగటం ఇదే మొట్టమొదటిసారి కాగా థర్డ్ జెండర్ కు ఇలా బంపర్ ఆఫర్ ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2019-20 మధ్య కాలంలో జరిగిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లో పాస్ అయిన లింగమార్పిడి చేసుకున్న వారికి ఇలా సర్కారీ కొలువులు దక్కాయి. దీంతో సమాజంలోని కట్టుబాట్లకు చెల్లు చీటి ఇచ్చినట్టైంది. ఇప్పటివరకు మనదేశంలో కేవలం కేవలం ఇద్దరు ట్రాన్స్ జెండర్లు మాత్రమే ఇలా ఖాకీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడు, రాజస్థాన్ లో ఒక్కరు చొప్పున ట్రాన్స్ జెండర్లు పోలీసు డిపార్ట్ మెంట్ లో లాఠీ ఝళిపిస్తున్నారు. మరోవైపు ఛత్తీస్ గఢ్ అడుగుజాడల్లో పయనించేందుకు బిహార్ సర్కారు కూడా సిద్ధమైంది.

  2014లో సుప్రీంకోర్టు ట్రాన్స్ జెండర్లను థర్డ్ జెండర్ గా గుర్తించింది. కాబట్టి స్త్రీ, పురుషులతో సమానంగా ఈ థర్డ్ జెండర్ కు గౌరవం, అవకాశాలు దక్కుతాయి. నిజానికి ఛత్తీస్ గఢ్ పోలీస్ శాఖ 2017లోనే థర్డ్ జెండర్ ను పోలీస్ ఎంపిక పరీక్షలు రాసేందుకు అర్హులుగా ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో లింగమార్పిడి చేయించుకున్నవారు పోలీసులు అయ్యేందుకు ఉత్సాహం చూపారు.

  చాలా కష్టపడ్డాం..

  పోలీస్ శాఖలో కొలువు సంపాదించటానికి తామెంతో కష్టపడ్డట్టు ఎంపికైన ట్రాన్స్ జెండర్లు చెబుతున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించేందుకు కఠినమైన శిక్షణ తీసుకున్నట్టు, పోలీస్ కావాలన్న కల ఎట్టకేలకు సాకారం అయిందని ఆనందం వ్యక్తం చేస్తున్న ఈ 13 మంది బృందం ట్రాన్స్ జెండర్లకు మంచి మార్గం చూపుతున్నారు. ఇప్పటికే మనదేశంలోని ట్రాన్స్ జెండర్లు చురుకైన పాత్ర పోషిస్తూ చాలా రంగాల్లోకి అడుగుపెడుతున్నారు. కోయంబత్తూరులో ట్రాన్స్ జెండర్లు నిర్వహిస్తున్న రెస్టారెంట్ లాభాల్లో పడటంతో వారు మరిన్ని బ్రాంచులు స్టార్ట్ చేయనున్నారు.

  ఇప్పుడిప్పుడే మనదేశంలో వీరిని చూసే దృష్టికోణంలో స్వల్పంగా మార్పులు వస్తున్నాయి. వీరికి కూడా చట్టరీత్యా సమాన హోదా, గౌరవం, అవకాశాలు దక్కేలా సుప్రీంకోర్టు థర్డ్ జెండర్ గా గుర్తించటంతో వీరికి పాన్, ఆధార్ తో సహా అన్ని గుర్తింపు కార్డులు లభిస్తున్నాయి. భారతీయ రైల్వేల్లో వీరికి 40శాతం రాయితీ రేటుకే టికెట్ లభిస్తుంది. వారణాసిలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకించిన టాయ్ లెట్లను ప్రారంభించారు. ట్రాన్స్ జెండర్ టాయిలెట్ పేరుతో దేశంలో మరిన్ని ఇలాంటివి ప్రారంభం కానున్నాయి.

  First published:

  Tags: Chhattisgarh, Police, Transgender

  ఉత్తమ కథలు