Metro Jobs: చెన్నై మెట్రోలో ఉద్యోగాలు... రూ.80,000 నుంచి వేతనం

Metro Jobs: చెన్నై మెట్రోలో ఉద్యోగాలు... రూ.80,000 నుంచి వేతనం (ప్రతీకాత్మక చిత్రం)

Chennai Metro Recruitment 2021 | చెన్నై మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలతో పాటు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    మెట్రోలో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వానికి చెందిన జాయింట్ వెంచర్ చెన్నై మెట్రో పలు ఖాళీలు భర్తీ చేస్తోంది. మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 10 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://chennaimetrorail.org/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. చెన్నై మెట్రో రైల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

    UPSC Recruitment 2021: కేంద్ర హోమ్ శాఖలో ఉద్యోగాలు... రూ.1,50,000 వరకు జీతం

    7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25,000 వరకు పెరగనున్న వేతనం

    Chennai Metro Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 10
    చీఫ్ జనరల్ మేనేజర్ (ప్లానింగ్ అండ్ డిజైన్)- 1
    జనరల్ మేనేజర్ (కన్‌స్ట్రక్షన్)- 2
    అడిషనల్ జనరల్ మేనేజర్ (సేఫ్టీ)- 1
    అడిషనల్ జనరల్ మేనేజర్ (లీగల్)- 1
    జాయింట్ జనరల్ మేనేజర్ (డిజైన్)- 1
    మేనేజర్ (డిజైన్- యూజీ)- 2
    మేనేజర్ (డిజైన్- ఎలివేటెడ్)- 2

    Constable Jobs: టెన్త్ పాసయ్యారా? 25,271 కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయండి ఇలా

    Army Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు... రూ.1,77,500 వరకు జీతం

    Chennai Metro Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 8
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 13
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
    అనుభవం- ప్రతీ పోస్టుకు అనుభవం తప్పనిసరి.
    వయస్సు- పోస్టును బట్టి గరిష్ట వయస్సు వేర్వేరుగా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
    దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50. దివ్యాంగులకు ఫీజు లేదు.
    ఎంపిక విధానం- రెండు దశల పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్. అభ్యర్థుల నాలెడ్జ్, స్కిల్స్, కాంప్రహెన్షన్, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ చేస్తారు.
    వేతనం- రూ.80,000 నుంచి రూ.2,50,000 వరకు
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    JOINT GENERAL MANAGER (HR)
    CHENNAI METRO RAIL LIMITED
    CMRL DEPOT, ADMIN BUILDING,
    POONAMALLEE HIGH ROAD,
    KOYAMBEDU, CHENNAI - 600 107.
    Published by:Santhosh Kumar S
    First published: