హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BMW Cars: ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్.. కరోనా క్లిష్ట సమయంలో పని చేసినందుకు ప్రతిఫలం

BMW Cars: ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్.. కరోనా క్లిష్ట సమయంలో పని చేసినందుకు ప్రతిఫలం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా లాంటి కష్ట సమయంలో సంస్థకు అండగా నిలిచిన ఉద్యోగులకు ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులకు బీఎండ్ల్యూ కార్లను ఇచ్చి వారిని ఆనందంలో ముంచెత్తింది.

కరోనా (Corona) మహమ్మారి మన జీవితాల్లో అనేక మార్పులను తీసుకువచ్చింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఐటీతో పాటు అనేక రకాల కంపెనీలు తప్పనిసరి పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోం (Work From Home) బాట పట్టాయి. వర్క్ ఫ్రం హోంతో మేలు అంటూ కొందరు వాదిస్తుంటే.. నష్టాలు కూడా ఎక్కువ అనే వారి సంఖ్య కూడా అనేకం. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా మంది ఉద్యోగులు కష్టపడి విధులు నిర్వర్తించారు. తమ సంస్థలపై వైరస్ ప్రభావం ఏ మాత్రం పడకుండా విధులు నిర్వర్తించి సంస్థల ఉన్నతికి కారణమయ్యారు. దీంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు (Employees) భారీగా ఇన్సెంటీవ్స్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కరోనా లాంటి కష్ట సమయంలో సంస్థకు అండగా నిలిచిన ఉద్యోగులకు ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులకు బీఎండ్ల్యూ కార్లను ఇచ్చి వారిని ఆనందంలో ముంచెత్తింది. చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ కంపెనీ కిస్‌ఫ్లో ఇంక్ ఈ పని చేసి ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలిచింది. కంపెనీ తన సీనియర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లోని ఐదుగురు ఉద్యోగులకు ఈ కార్లను బహుమతిగా అందించింది. అయితే.. ఈ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చే విషయాన్ని కంపెనీ సీక్రెట్ గా ఉంచింది.

ఈవెంట్ ప్రారంభమైన తర్వాత ఐదుగురు లక్కీ ఉద్యోగులు అత్యంత ఖరీదైన కార్లకు ఓనర్లుగా మారబోతున్నారంటూ ప్రకటించి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఐదుగురు ఉద్యోగులకు సంస్థ ప్రారంభమైన నాటి నుంచి సంస్థను వీడకుండా పని చేశారని సీఈఓ సురేష్ తెలిపారు. ఈ ఉద్యోగులకు కరోనా కష్ట సమయంలో సంస్థకు అండగా నిలిచి మెరుగైన సేలవలు అందించినట్లు చెప్పారు.

IT Employees: వర్క్ ఫ్రం హోంకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే.. కీలక నిర్ణయాలు తీసుకొంటున్న ప్రముఖ ఐటీ సంస్థ..

కరోనా సమయంలో కొందరి ఇన్వెస్టర్ల నుంచి తాము ఎన్నో ప్రశ్నలను, సందేహాలను ఎదుర్కొన్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం మాత్రం తాము సంతోషంగా ఉన్నట్లు సీఈఓ చెప్పారు. ఇన్వెస్టర్లు ఆశించిన ఫలితాలను అందిస్తున్నామన్నారు. కిస్‌ఫ్లో ప్రారంభించిన తర్వాత కొందరు ఉద్యోగులు మధ్యలోనే సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోయారని సురేష్ గుర్తు చేసుకున్నారు. కంపెనీని గట్టెక్కించేందుకు తనతో పాటు పనిచేసిన ఈ ఐదుగురి ఉద్యోగుల సేవలకు ప్రతిఫలంగా వారికి బీఎండబ్ల్యూ కార్లను గిఫ్ట్ గా ఇచ్చినట్లు చెప్పారు సురేష్.

First published:

Tags: Bmw, Bmw car, Career and Courses, IT Employees