హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarships: స్టూడెంట్స్‌కు అలర్ట్.. ఈ స్కాలర్‌షిప్స్‌తో భారీ స్టైఫండ్..!

Scholarships: స్టూడెంట్స్‌కు అలర్ట్.. ఈ స్కాలర్‌షిప్స్‌తో భారీ స్టైఫండ్..!

Scholarships: స్టూడెంట్స్‌కు అలర్ట్.. ఈ స్కాలర్‌షిప్స్‌తో భారీ స్టైఫండ్..!

Scholarships: స్టూడెంట్స్‌కు అలర్ట్.. ఈ స్కాలర్‌షిప్స్‌తో భారీ స్టైఫండ్..!

Scholarships: ప్రస్తుతం అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు వివిధ రకాల స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. 2023 సంవత్సరానికి సంబంధించి కొన్ని సంస్థలు ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ ప్రకటించాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఆర్థికంగా వెనుకబడిన వారికి స్కాలర్‌షిప్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఉన్నత విద్యకు తోడ్పాటును అందించే ఫెలోషిప్స్‌తో చాలామంది ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు వివిధ రకాల స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. 2023 సంవత్సరానికి సంబంధించి కొన్ని సంస్థలు ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ ప్రకటించాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

* కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషనల్ స్కాలర్‌షిప్, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్

కోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ఈ స్కాలర్‌షిప్, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ పూర్తిచేసి ఉండాలి. అలాగే నిరుపేద పిల్లలకు బోధించడం లేదా స్పోర్ట్స్ ట్రైనింగ్ అందిస్తూ ఉండాలి. అప్లికెంట్స్ క్రీడాకారులైతే, గత రెండు మూడేళ్లలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం లేదా దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

జాతీయ ర్యాంకింగ్‌లో 500లోపు, రాష్ట్ర ర్యాంకింగ్‌లో 100లోపు ర్యాంక్ సాధించి ఉండాలి. వారి వయసు 9 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుదారుని కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.5 లక్షలలోపు ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు www.b4s.in/it/KSSI2 అనే లింక్ ద్వారా మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి మూడేళ్లపాటు సంవత్సరానికి రూ.75,000 స్కాలర్‌షిప్ అందనుంది.

* గాంధీ ఫెలోషిప్

ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను పిరమల్ ఫౌండేషన్ (NGO) అందించనుంది. గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దీని కోసం అప్లై చేసుకోవచ్చు. వయసు 18-26 ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్స్‌తో పాటు క్రీడలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్, వాలంటరీ వర్క్, డిబేట్స్, సాహిత్యం వంటి అంశాల్లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్, అప్లైడ్ అండ్ ప్యూర్ సైన్స్, కామర్స్, మేనేజ్‌మెంట్, హ్యుమనిటీస్ అండ్ లిబరల్ ఆర్ట్స్, సోషల్ వర్క్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ వంటి వాటిపై యూజీ లేదా పీజీ కోర్సులు చేస్తుండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు https://gandhifellowship.creatrixcampus.com/admissionregistration/default/create లింక్ ద్వారా మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.25,000 నుంచి రూ.28,000 మధ్య స్టైపెండ్ లభించనుంది.

* గ్లోబల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్

ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను AIS టెక్నోలాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫర్ చేస్తోంది. యూజీ, పీజీ కోర్సులు చేయాలనుకుంటున్న మెరిట్ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు సెకండరీ స్కూల్/ హైస్కూల్ విద్యను పూర్తిచేయాలి. గుర్తిపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో యూజీ/పీజీ కోర్సు కోసం దరఖాస్తు చేసి ఉండాలి. అలాగే అప్లికెంట్ సంబంధిత కోర్సులో ఇప్పటికే కనీసం ఒక టర్మ్ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు https://www.aistechnolabs.co లింక్ ద్వారా మే 15లోపు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.2లక్షల వరకు యాన్యువల్ స్కాలర్‌షిప్ అందుతుంది.

* ఓఎన్‌జీసీ స్పోర్ట్స్ స్కాలర్‌షిప్ స్కీమ్

ఈ స్కాలర్‌షిప్‌నుఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన కార్పొరేట్ స్పోర్ట్స్ డివిజన్ ఆఫర్ చేస్తోంది. యువత క్రీడల్లో మరింతగా రాణించడం కోసం ఈ స్కాలర్‌షిప్ పథకం ద్వారా ఆర్థిక సహాయం చేయనున్నారు. 14-25 ఏళ్ల మధ్య ఉన్న క్రీడాకారులు మార్చి 27లోపు https://www.ongcindia.com/ అనే అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చెస్, జిమ్నాస్టిక్స్ స్విమ్మింగ్‌ వంటి స్పోర్ట్స్‌లో కనీన వయసు 10 సంవత్సరాలు‌గా పరిగణించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 నుంచి 30,000 మధ్య స్కాలర్‌షిప్ అందుతుంది.

First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Scholarship

ఉత్తమ కథలు