హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Internships: డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌, AIలో స్పెషల్ ఇంటర్న్‌షిప్స్.. స్టైపండ్ నెలకు రూ.20000!

Internships: డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌, AIలో స్పెషల్ ఇంటర్న్‌షిప్స్.. స్టైపండ్ నెలకు రూ.20000!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Internships: ఫుల్ టైమ్ ఉద్యోగానికి ముందు కెరీర్‌కు ఉపయోగపడేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇతర సైన్స్ అండ్ టెక్ విభాగాల్లో ఇంటర్న్‌షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి కొన్ని ప్రముఖ సంస్థలు. ఆ వివరాలు చెక్ చేద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

విద్యార్థులు (Students) కాలేజీల్లో నేర్చుకునే థిరిటికల్ నాలెడ్జ్‌ను జాబ్ ఫీల్డ్‌ (Job Field)లో టెస్ట్ చేసుకోవడానికి మార్గాలుగా నిలుస్తున్నాయి ఇంటర్న్‌షిప్స్ (Internships). ఇప్పుడు వివిధ రంగాల్లో స్కిల్ బేస్డ్ ఇంటర్న్‌షిప్స్ అందిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతోంది. ఇవి కెరీర్ గ్రోత్‌కు బాటలు వేస్తుండటంతో, అభ్యర్థుల నుంచి డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ఫుల్ టైమ్ ఉద్యోగానికి ముందు కెరీర్‌కు ఉపయోగపడేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇతర సైన్స్ అండ్ టెక్ విభాగాల్లో ఇంటర్న్‌షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి కొన్ని ప్రముఖ సంస్థలు. ఆ వివరాలు చెక్ చేద్దాం.

* హైదరాబాద్‌లో

క్యూబ్ హైవేస్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అసెట్స్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ ఇమేజ్ ప్రాసెసింగ్ (ML & AI) ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తోంది. ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ అక్టోబర్ 6. ఈ ఇంటర్న్‌షిప్ కోసం అభ్యర్థులు హైదరాబాద్‌లో 6 నెలల పాటు పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నెలకు రూ.20,000 స్టైఫండ్‌ అందిస్తారు.

* ముంబైలో డేటా అనలిటిక్స్ ఇంటర్న్‌షిప్

ముంబై కేంద్రంగా పనిచేసే ఆప్టివైజ్ ఆన్‌లైన్‌ సంస్థ డేటా అనలిటిక్స్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తోంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 స్టైఫండ్‌ అందిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఇంటర్న్‌షాలా ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్‌కు చివరి తేదీ అక్టోబర్ 8. ఇది మూడు నెలల పాటు కొనసాగే ఇంటర్న్‌షిప్. అభ్యర్థులు ముంబైలో ఉన్న ఆఫీస్‌లో వర్క్ చేయాలి.

* UFF ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్

UFF ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ అందిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 6 లోపు ఇంటర్న్‌షాలా ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు మూడు నెలల పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.2,500 స్టైఫండ్‌ అందిస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంటుంది.

* డేటా సైన్స్ ఇంటర్న్‌షిప్

డార్విన్ డిజిటెక్‌ కంపెనీ డేటా సైన్స్ ఇంటర్న్‌షిప్ అందిస్తోంది. ఇది 6 నెలల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్. అభ్యర్థి పనితీరు సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, వారికి జాబ్ ఆఫర్ కూడా ఇస్తారు. ఇంటర్న్‌షాలా ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ అక్టోబర్ 7. ఎంపికైన వారికి రూ.6,000 నుంచి రూ.9,000 వరకు స్టైఫండ్‌ ఇస్తారు.

ఇది కూడా చదవండి : ఇంటర్ తో ఉద్యోగ అవకాశాలు.. ఈ కోర్సులతో రూ.5లక్షలకు పైగా ప్యాకేజీ..

* కాగ్నిటివ్ డేటా సైన్స్, AI, ML ఇంటర్న్‌షిప్స్

ఈ ఇంటర్న్‌షిప్‌నకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 10. ఆసక్తి గల అభ్యర్థులు AICTE ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. మొత్తం మూడు నెలల పాటు కొనసాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ ఇది. అయితే కేవలం వర్క్ నేర్చుకోవాలని భావించే వారే దీన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే సర్వీస్ పీరియడ్‌లో ఎలాంటి స్టైఫండ్ లభించదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Data science, EDUCATION, Internship, JOBS

ఉత్తమ కథలు