Home /News /jobs /

CHANGES IN CBSE SYLLABUS QUESTION PAPER IN THE NEW SYSTEM FROM WHEN WILL IT BE IMPLEMENTED UMG GH

CBSC: సీబీఎస్ఈ సిలబస్ లో మార్పులు.. కొత్త విధానంలో ప్రశ్నా పత్రం.. ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే..?

సీబీఎస్ఈ సిలబస్ లో మార్పులు.. కొత్త విధానంలో ప్రశ్నా పత్రం..

సీబీఎస్ఈ సిలబస్ లో మార్పులు.. కొత్త విధానంలో ప్రశ్నా పత్రం..

విద్యార్థులు నేర్చుకున్న విషయాలను, వారి లెర్నింగ్ సామర్థ్యాలను అంచనా వేయడానికి సీబీఎస్ఈ (CBSE) బోర్డు అసెస్‌మెంట్ ప్రాసెస్‌ (Assessment Process) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అంచనా పద్ధతిలో వచ్చే ఏడాది పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలని బోర్డు నిర్ణయించింది.

ఇంకా చదవండి ...
విద్యార్థులు నేర్చుకున్న విషయాలను, వారి లెర్నింగ్ సామర్థ్యాలను అంచనా వేయడానికి సీబీఎస్ఈ (CBSE) బోర్డు అసెస్‌మెంట్ ప్రాసెస్‌ (Assessment Process) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అంచనా పద్ధతిలో వచ్చే ఏడాది పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలని బోర్డు నిర్ణయించింది. ఈ మొత్తం ప్రక్రియను మరింత సమగ్రంగా, స్కిల్-బేస్డ్‌గా, ఎబిలిటీ ఆధారితంగా చేయడానికి సీబీఎస్ఈ చాలా మార్పులు తీసుకొస్తోంది. ఈ మార్పులన్నీ ప్రాథమికంగా జాతీయ విద్యా విధానం (NEP-2020)పై ఆధారపడి ఉంటాయి. ఈ మార్పుల వల్ల 10, 12వ తరగతుల విద్యార్థులు(Students), తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా అనేక రకాల నిర్మాణాత్మక పునరుద్ధరణలను చూస్తారు. ఈ మార్పులు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాల సమగ్ర అంచనాకు సహాయపడుతుంది. ఈ మార్పులు కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే ప్రవేశపెట్టగా... వీటివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో గమనించి 2024 నుంచి అన్ని పాఠశాలలు వీటిని అనుసరిస్తాయి. అసెస్‌మెంట్(Assessment) ప్రాసెస్‌లో సీబీఎస్ఈ తీసుకురానున్న మార్పులు గురించి CBSE కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి తాజాగా ఓ ఇంటర్వ్యూ వివరించారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాక్టికల్ పరీక్షలు లేని అన్ని సబ్జెక్టులకు 20% ఇంటర్నల్ అసెస్‌మెంట్
విద్యా సంవత్సరం చివరిలో కేవలం మూడు గంటల నిడివి గల ఒకే ఒక పరీక్ష పెట్టి విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు. అందుకే అసెస్‌మెంట్ అనేది ఏడాది పొడవునా జరిగే ఓ ప్రక్రియగా ఉండాలని CBSE కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు లేని అన్ని పేపర్లలో కూడా 20% ఇంటర్నల్ అసెస్‌మెంట్ అవసరమని పేర్కొన్నారు. ఈ ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల గ్రూప్‌లు అంచనా వేస్తారు. దాని ఆధారంగా 20% మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే ప్రాజెక్టులు, ఇండస్ట్రీ కనెక్షన్లు, సామాజిక పని, క్రీడలు కూడా ఉంటాయని త్రిపాఠి చెప్పారు.

క్వశ్చన్ పేపర్లలో ప్రధాన మార్పులు
క్వశ్చన్ పేపర్లలో రెండు రకాల నిర్మాణాత్మక మార్పులు ఉంటాయని... మొదటి మార్పులో విద్యార్థులకు మరిన్ని ఛాయస్‌లు అందించడానికి సీబీఎస్ఈ ప్రశ్నల సంఖ్యను 33% పెంచుతుందని త్రిపాఠి అన్నారు. ప్రశ్నల సంఖ్య పెరిగితే.. క్వశ్చన్ పేపర్ సైజు పెరుగుతుందని, అలాగే తగిన ప్రశ్నలను ఎంచుకునే సౌలభ్యం విద్యార్థులకు ఉంటుంది.

ప్రశ్నల్లో శ్లేషణాత్మక, క్రిటికల్ థింకింగ్‌పై
సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల్లో రెండో మార్పు ప్రశ్నలు అడిగే రకంలో ఉంటుంది. ఇకనుంచి విద్యార్థులు విశ్లేషణాత్మకంగా, క్రిటికల్‌గా ఆలోచించేలా సీబీఎస్ఈ ప్రశ్నలు అడగనుంది. అంటే వీటికి సమాధానాలు ఇవ్వడం ఇక నుంచి విద్యార్థుల నైపుణ్యం (skill-based), సామర్థ్యాల (Competency)పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు పుస్తకంలో ఉండవు కాబట్టి విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను ఆధారంగా చేసుకొని, బాగా ఆలోచించి వాటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీటి కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా సాధన చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: Punjab Schools: తెలుగు భాషకు అరుదైన గౌరవం.. ఆ రాష్ట్రంలో బోధించాలని నిర్ణయం.. తలలు పట్టుకుంటున్న టీచర్లు!


3, 5, 8 తరగతులలో జరిగే అసెస్‌మెంట్ సర్వే
విద్యార్థుల్లో నిర్మాణాత్మక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సీబీఎస్ఈ దృష్టి పెట్టింది. సీబీఎస్ఈ తన అసెస్‌మెంట్ ప్రక్రియలో 3, 5, 8 తరగతులలో విద్యార్థులకు అసెస్‌మెంట్ సర్వే నిర్వహించనుంది. ఈ మార్పు విద్యార్థి నిర్మాణాత్మక అసెస్‌మెంట్ సాధించడమే లక్ష్యంగా ఉంటుంది. "ఇప్పటి వరకు 1 నుంచి 10వ తరగతి వరకు ఒక విద్యార్థి సామర్థ్య స్థాయి ఏమిటో తెలియదు. విద్యార్థికి అభ్యసన, నేర్చుకునే స్థాయిని కూడా మనం గుర్తించలేం. ఈ తరగతుల్లో విద్యార్థులలోని సామర్థ్యాలను సీబీఎస్‌ఈ బోర్డుతో టీచర్లు ఎప్పుడూ పంచుకోలేదు. అందుకే మేం సర్వే నిర్వహించనున్నాం. ఈ పరీక్ష విద్యార్థులు మార్కులు సాధించే సాధారణ పరీక్షలా ఉండదు. ఈ పరీక్షల ద్వారా మేం వారి సామర్థ్యాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలియజేస్తాం." అని అనురాగ్ త్రిపాఠి వివరించారు.



హోలిస్టిక్ అసెస్‌మెంట్ కార్డ్‌ల పరిచయం
360-డిగ్రీల అసెస్‌మెంట్‌ను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పీర్ గ్రూపులు, విద్యార్థుల ద్వారా చేయనుంది. CBSE విద్యార్థుల కోసం హోలిస్టిక్ అసెస్‌మెంట్ కార్డ్‌లను కూడా ప్రవేశపెట్టబోతోంది. ఇందులో విద్యార్థులు కూడా సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకుంటారు. కొన్ని పాఠశాలల్లో, ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా కూడా ప్రారంభించిన్నట్లు త్రిపాఠి చెప్పారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, CBSE, JOBS, NEET

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు