ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనీషియేటీవ్ 2020 ప్రోగ్రామ్... 100 మంది అమ్మాయిలకు అవకాశం

Young Women in Investment initiative 2020 | ఆసక్తి గల అమ్మాయిలు https://www.empoweringyoungwomen.cfa/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మొత్తం 100 మాత్రమే ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

news18-telugu
Updated: February 24, 2020, 6:06 PM IST
ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనీషియేటీవ్ 2020 ప్రోగ్రామ్... 100 మంది అమ్మాయిలకు అవకాశం
ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనీషియేటీవ్ 2020 ప్రోగ్రామ్... 100 మంది అమ్మాయిలకు అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సీఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్ 'యంగ్ ఉమెన్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీషియేటీవ్ 2020' కార్యక్రమాన్ని ప్రకటించింది. అమ్మాయిల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. పెట్టుబడుల పరిశ్రమలో గల అవకాశాలపై అవగాహన కల్పించడంతో పాటు ఈ రంగంలో అమ్మాయిలు, మహిళల పాత్రను పెంచేందుకు సీఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన కార్యక్రమం ఇది. 2020 కార్యక్రమం కోసం 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌కు అంతర్జాతీయ సంఘంగా పనిచేస్తోంది సీఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే 'యంగ్ ఉమెన్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీషియేటీవ్ 2020' కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ యూసుఫ్ గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీలో 'ఆర్థిక సేవల రంగంలో మహిళలకు ఉన్న కెరీర్ అవకాశాలు' పేరుతో సెమినార్ నిర్వహించారు.

సరైన మార్గనిర్దేశకత్వం లేకపోవడం, తగిన అవకాశాలు లేకపోవడం గురించి తరచుగా మహిళలు చెబుతుంటారు. ముఖ్యంగా భారతదేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాల్లోని మహిళలకు ఇవి తమ కెరీర్ నిర్మాణంలో ప్రధాన అవరోధాలుగా నిలుస్తుంటాయి. ఆర్థిక పరిశ్రమలో వైవిధ్యత కోసం, ఈ ఇండస్ట్రీలో కెరీర్ ఎంచుకోవాలనుకునే మహిళలకు ఈ 'యంగ్ ఉమెన్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీషియేటీవ్ 2020' కార్యక్రమం ఉపయోగపడుతుంది.
అమిత్ చక్రవర్తి, డైరెక్టర్, ఇన్‌స్టిట్యూషనల్ రిలేషన్స్, సౌత్ అండ్ ఈస్ట్ ఏసియా, సీఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్


CFA Institute, Young Women in Investment program, Young Women in Investment initiative 2020 program, Young Women in Investment 2020, Investment ideas, సీఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్, యంగ్ ఉమెన్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్, యంగ్ ఉమెన్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీషియేటీవ్ 2020 ప్రోగ్రామ్, ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాస్
సెమినార్‌లో మాట్లాడుతున్న అమిత్ చక్రవర్తి, డైరెక్టర్, ఇన్‌స్టిట్యూషనల్ రిలేషన్స్, సౌత్ అండ్ ఈస్ట్ ఏసియా, సీఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్
ఆసక్తి గల అమ్మాయిలు https://www.empoweringyoungwomen.cfa/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మొత్తం 100 మాత్రమే ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2020 మార్చి 8 లేదా అప్లికేషన్ విండో క్లోజ్ చేసే లోపు అప్లై చేయాలి. ఆర్ట్స్, సైన్సెస్, కామర్స్, ఇంజనీరింగ్ లాంటి అంశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన అమ్మాయిలు, మహిళలు మాత్రమే అప్లై చేయాలి. కనీసం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. ఎంపికైనవారికి ముంబై, బెంగళూరులో నాలుగు వారాల బూట్ క్యాంప్ ఉంటుంది. క్యాంప్ సమయంలో ఉచితంగా వసతి, భోజనం లాంటి సదుపాయాలు ఉంటాయి. ఈ బూట్ క్యాంప్‌లో వ్యాపార నైపుణ్యాలు, ఇన్వెస్ట్‌మెంట్ ఇండస్ట్రీలోని ప్రాథమిక అంశాల గురించి అవగాహన కల్పిస్తారు. అభ్యర్థులందరికీ స్టైపెండ్‌తో పాటు భారతదేశంలో సుప్రసిద్ధ ఆర్థిక సంస్థలో ఇంటర్న్‌షిప్‌ అవకాశం కూడా కల్పిస్తారు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:CTET July 2020: టీచర్ కావాలనుకునేవారికి గుడ్ న్యూస్... సీటెట్ 2020 గడువు పెంపు

SSC Recruitment 2020: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1157 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

RRB Exam Fees Refund: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ఎగ్జామ్ ఫీజు వెనక్కి ఇస్తున్న ఆర్ఆర్‌బీ
First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు