CET FOR GOVT JOBS BLUE SHADOWS ON COMMON ELIGIBILITY TEST IS THERE A CHANCE OF EXAM DELAY DUE TO CORONA GH EVK
CET for Govt Jobs: కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌పై నీలినీడలు.. కరోనా కారణంగా పరీక్ష ఆలస్యమయ్యే అవకాశం?
ప్రతీకాత్మక చిత్రం
Common Eligibility Test | కేంద్ర ప్రభుత్వ, బ్యాంక్ ఉద్యోగాల (Bank Jobs) కోసం ఒకే విధమైన పరీక్షను నిర్వహిస్తున్నారనే సంగతి తెలిసిందే. అదే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CET). అయితే ఈ పరీక్ష మరోసారి ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దేశంలో కరోనా కేసులు ఊహించని రీతిలో పెరుగుతుండటంతో ఎగ్జామ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
కేంద్ర ప్రభుత్వ, బ్యాంక్ ఉద్యోగాల (Bank Jobs) కోసం ఒకే విధమైన పరీక్షను నిర్వహిస్తున్నారనే సంగతి తెలిసిందే. అదే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CET). అయితే ఈ పరీక్ష మరోసారి ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దేశంలో కరోనా కేసులు ఊహించని రీతిలో పెరుగుతుండటంతో ఎగ్జామ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ స్క్రీనింగ్ టెస్టు ద్వారా గ్రూప్-బీ (Non-Gazetted), గ్రూప్-సీ(non-technical) పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఉద్యోగాలకు ఈ ఏడాది మార్చిలో నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు.
అయితే కోవిడ్ 19 కేసులు (Covid 19 Cases) విపరీతంగా పెరుగుతున్న కారణంగా పరీక్ష నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి ఈ అంశంపై స్పందించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం మార్చిలో జరగనున్న కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించే అవకాశం తక్కువేనని చెప్పకనే చెప్పారు. ఈ పరీక్షను వాయిదా వేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కరోనా మహమ్మారి కారణంగానే పరీక్ష తేదీని పొడిగించారు. అసలైతే గతేడాది సెప్టెంబరు-అక్టోబరులోనే ఇది జరగాల్సి ఉంది.
2020లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ఏటా 1.25 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలవుతుండగా, దాదాపు 4 కోట్ల మంది అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకుంటున్నారు. వారికి ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించే బాధ్యతను కేంద్రం ఈ నియామక సంస్థకు అప్పగించింది. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అందరికీ ఒకే రకమైన స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC), IBPS, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) పరీక్షలకు షార్ట్ లిస్ట్ అవుతారు. మిగిలిన మెయిన్ పరీక్షలను ఆయా ఏజెన్సీలు నిర్వహించి తుది ఫలితాలు విడుదల చేస్తాయి. సీఈటీ స్కోర్ ఆధారంగానే మెయిన్ పరీక్షకు ఎంపికవుతారు. రానున్న కాలంలో ఈ పరీక్షను ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా విస్తరిస్తామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలోని నాన్ గెజిటెడ్, క్లాస్ 10, క్లాస్12, గ్రాడ్యూయేషన్ స్థాయి ఉద్యోగాలకు మాత్రమే నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
పరీక్ష నిర్వహణకు భారీగా ఏర్పాట్లు..
మార్చిలో జరగాల్సిన కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా వందల కేంద్రాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలోనూ ఒక పరీక్ష కేంద్రం ఉండాలని, జిల్లా పెద్దగా ఉంటే ఒకటి కంటే ఎక్కువ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తెలిపింది. గతేడాది లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో లే, కార్గిల్ వేదికగా రెండు కేంద్రాలను ఏర్పాటు చేశామని కేంద్రమంత్రి డాక్టర్ జతిన్ సింగ్ స్పష్టం చేశారు.
అప్లికేషన్ ఫారాలు నింపడానికి కనీసం ఒక నెల నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. సుదూర ప్రాంత అభ్యర్థులకు మరో రెండు వారాల అదనపు సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఎలిజిబిలిటీ తనిఖీలు, రోల్ నంబర్ల జారీ, పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం, కనెక్టివిటీ ఇలా పలు రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని మరో ప్రభుత్వ అధికారి తెలిపారు. మొదటి నోటీసు ఇచ్చినప్పటి నుంచి ఈ ఏర్పాట్ల కోసం 120 రోజుల సమయం పట్టిందని, పరీక్ష ఫలితాలకు మరో 3, 4 నెలల సమయం పడుతుందని ఆయన అన్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.