Scholarship Exam: ఆర్మీ ఉద్యోగం మీ కలా? మీ కోసమే ఈ స్కాలర్‌షిప్ టెస్ట్

Shishir Rameshwar National Talent Hunt SRNTH 2020 | మొదటి ర్యాంక్ వచ్చినవారికి రూ.20,000, రెండో ర్యాంక్ వచ్చినవారికి రూ.10,000, మూడో ర్యాంక్ వచ్చినవారికి రూ.6,000, నాలుగు నుంచి పది ర్యాంకులు వచ్చినవారికి రూ.2000 చొప్పున పారితోషికం లభిస్తుంది.

news18-telugu
Updated: December 12, 2019, 3:23 PM IST
Scholarship Exam: ఆర్మీ ఉద్యోగం మీ కలా? మీ కోసమే ఈ స్కాలర్‌షిప్ టెస్ట్
Scholarship Exam: ఆర్మీ ఉద్యోగం మీ కలా? మీ కోసమే ఈ స్కాలర్‌షిప్ టెస్ట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆర్మీ ఉద్యోగం మీ కలా? ఆర్మీ జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారా? మీలాంటి ప్రతిభ ఉన్నవారిని ఆర్థికంగా చేయూతను అందించేందుకు సెంచూరియన్ డిఫెన్స్ అకాడమీ 'శిశిర్ రామేశ్వర్ నేషనల్ టాలెంట్ హంట్-SRNTH 2020' నిర్వహించబోతోంది. ఇందులో ప్రతిభ చూపించినవారు రూ.20,000 వరకు స్కాలర్‌షిప్ గెలుచుకోవచ్చు. ప్రతిభ ఉన్నా సరైన శిక్షణ పొందేందుకు కావాల్సిన ఆర్థిక సహకారం లేక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న స్కాలర్‌షిప్ టెస్ట్ ఇది. దేశంలోని 15 రాష్ట్రాల్లో ఈ స్కాలర్‌షిప్ టెస్ట్ జరుగుతోంది. మొదటి ర్యాంక్ వచ్చినవారికి రూ.20,000, రెండో ర్యాంక్ వచ్చినవారికి రూ.10,000, మూడో ర్యాంక్ వచ్చినవారికి రూ.6,000, నాలుగు నుంచి పది ర్యాంకులు వచ్చినవారికి రూ.2000 చొప్పున పారితోషికం లభిస్తుంది. అంతేకాదు... 1 నుంచి 10 ర్యాంకులు వచ్చిన వారికి 100% ట్యూషన్ ఫీజు డిస్కౌంట్ లభిస్తుంది. ఇలా 3000 పైగా ర్యాంకులు సాధించినవారికి కూడా ఫీజులో డిస్కౌంట్ లభిస్తుంది.

ఆసక్తిగల అభ్యర్థులు www.defenceguru.co.in లేదా www.centuriondefenceacademy.com వెబ్‌సైట్లల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100. దరఖాస్తు చేయడానికి 2019 డిసెంబర్ 18 చివరి తేదీ. 10వ, 11వ, 12వ తరగతి పాసైనవారు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 2 వారాల్లో అడ్మిట్ కార్డ్ వస్తుంది. మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, మెంటల్ యాప్టిట్యూడ్‌లో 100 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Hyderabad Job Mela: హైదరాబాద్‌లో జాబ్ మేళా... టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతBank of Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
First published: December 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు