Home /News /jobs /

CENTRE SAID ECONOMICALLY WEAKER SECTION QUOTA RULES WILL CHANGE FROM NEXT YEAR NS

వచ్చే ఏడాది నుంచి EWS కోటా రిజర్వేషన్ల రూల్స్ మార్పు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడావిట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సుప్రీంకోర్టుకు కీలక అఫిడావిట్ దాఖలు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఈ దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ (EWS Reservation) లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాన్ని ఈ విద్యా సంవత్సరానికి అలాగే ఉంచుతామని కేంద్రం సుప్రీంకోర్టుకు (Supreme Court) తెలిపింది. ఈ మేరకు శక్రవారం అఫిడావిట్ దాఖలు చేసింది. ఈ రోజు ఉదయం ఇందుకు సంబంధించన వివరాలు వెలువడ్డాయి. నీట్ (NEET) అభ్యర్థుల కోసం అడ్మిషన్లు మరియు కాలేజీలకు కేటాయింపులు కొనసాగుతున్న ఈ సమయంలో నిబంధనలను మార్చడం ఇబ్బందులకు దారితీస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు లబ్ధిదారులను గుర్తించే విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్తింపజేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.

    ఇదిలా ఉంటే.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test​)–2021 కౌన్సెలింగ్ మొత్తం నాలుగు రౌండ్లలో జరగనుందని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ప్రకటించింది. ఈ కౌన్సెలింగ్​ను ఆన్​లైన్ (Online)​ మోడ్​లోనే నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఆల్ ఇండియా కోటా(ఏఐక్యూ) సీట్లను రౌండ్ 1, రౌండ్ 2, మాప్- అప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్ ఇలా మొత్తం నాలుగు రౌండ్లలో భర్తీ చేయనున్నారు. మెడికల్​ కౌన్సెలింగ్​ కమిటీ ( Medical Counselling Committee) 15 శాతం అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. అయితే, సీట్ల ప్రక్రియలో భిన్నమైన ప్రక్రియను అనుసరిస్తారు. రౌండ్ 2 పూర్తయిన తర్వాత మిగిలిన సీట్లను మాప్- అప్, స్ట్రే వెకెన్సీ ద్వారా భర్తీ చేస్తారు.
    Exam Postpone: విద్యార్థులకు అలర్ట్.. ఎన్నికల నేపథ్యంలో ఆ పరీక్ష షెడ్యూల్ విడుదల ఆలస్యం..? వివరాలివే..

    ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్‌ కోసం అభ్యర్థులు ఎటువంటి రిజిస్ట్రేషన్ (Registration) చేసుకోవాల్సిన పనిలేదు. అయితే, రౌండ్ 1లో సీటు దక్కించుకున్న వారికి మాత్రమే అప్‌గ్రేడేషన్, కోర్సు నుంచి ఉచితంగా ఎగ్జిట్ (Free Exit)​ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం రౌండ్ 2, రౌండ్ 3లో సీటు దక్కించుకున్న వారికి ఉండదు. ఇక, రౌండ్ 2, రౌండ్​3ల్లో సీట్లు దక్కించుకున్న వారికి రౌండ్​ 4 కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అనుమతి ఉండదు.
    NEET 2022: నీట్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ యాప్‌లో ఉచితంగా మాక్ టెస్టులు

    నీట్–2021 ఫలితాలు నవంబర్ 1న విడుదలయ్యాయి. అయితే ఈడబ్ల్యూఎస్ (EWS)​, ఓబీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ కొంత మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై సుప్రీం కోర్డు (Supreme Court) లో విచారణ జరుగుతున్నందుకున కౌన్సెలింగ్​ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. పిటిషన్​పై​ తదుపరి విచారణ జనవరి 6న జరగనుంది. తుది తీర్పు వెలువడ్డ తర్వాతే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, NEET, Reservations

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు