కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యాసంస్థలు ఎప్పటి నుంచి మొదలవుతాయనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా.. ఈ విషయంలో అసలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి విధానాన్ని రూపొందించకపోవడం పలు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఈ అంశంపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండటంతో... అసలు ఆన్లైన్ క్లాసుల విషయంలో కేంద్రం వైఖరి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ అంశంపై మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు సంబంధించి కేంద్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో కేంద్రం ఉందని... జులై 15న వీటిని విడుదల చేసే అవకాశం ఉందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ శంకర్ నారాయణ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన విచారణను మద్రాస్ హైకోర్టు జులై 20కు వాయిదా వేసింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.