CDAC Jobs: సీడాక్‌లో 116 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

CDAC Recruitment 2019 | హైదరాబాద్‌లో 16, బెంగళూరులో 18, తిరువనంతపురంలో 82 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది.

news18-telugu
Updated: October 24, 2019, 11:40 AM IST
CDAC Jobs: సీడాక్‌లో 116 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
CDAC Jobs: సీడాక్‌లో 116 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సైంటిఫిక్ సొసైటీ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ C-DAC ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌లో 16, బెంగళూరులో 18, తిరువనంతపురంలో 82 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. దరఖాస్తు ప్రారంభ తేదీలు, ముగింపు తేదీలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. అందుకే అభ్యర్థులు ముందుగానే అన్ని నోటిఫికేషన్లు పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. మరిన్ని వివరాలను C-DAC అధికారిక వెబ్‌సైట్‌ https://cdac.in ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు.

CDAC Recruitment 2019: సీడాక్-హైదరాబాద్ నోటిఫికేషన్ వివరాలివే


మొత్తం ఖాళీలు- 16

ప్రాజెక్ట్ మేనేజర్- 1
ప్రాజెక్ట్ ఇంజనీర్- 14
ప్రాజెక్ట్ అసోసియేట్- 1


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 23
Loading...
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 11
హైదరాబాద్‌లోని సీడాక్ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

CDAC Recruitment 2019: సీడాక్-బెంగళూరు నోటిఫికేషన్ వివరాలివే


మొత్తం ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు- 18
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 11
బెంగళూరులోని సీడాక్ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

CDAC Recruitment 2019: సీడాక్-తిరువనంతపురం నోటిఫికేషన్ వివరాలివే


మొత్తం పోస్టులు- 82
ప్రాజెక్ట్ ఇంజనీర్- 73
ప్రాజెక్ట్ అసిస్టెంట్- 5
ప్రాజెక్ట్ టెక్నీషియన్- 3
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 11
తిరువనంతపురంలోని సీడాక్ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... డిప్లొమా, బీటెక్ పాసైతే చాలు

BEL Jobs: భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్... బీటెక్ అర్హత

SSC CGL Exam: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి డిగ్రీ చాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: October 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...