హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CSB Recruitment 2022: సెంట్రల్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. 

CSB Recruitment 2022: సెంట్రల్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్‌లో(Central Silk Board) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు(Applications) కోరుతోంది. 3 కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్‌లో(Central Silk Board) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు(Applications) కోరుతోంది. 3 కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌లైన్(Offline) ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను ఆహ్వానించారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 9 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆరు నెలల పాటు భర్తీ చేస్తోంది. అభ్యర్థి పనితీరు ఆధారంగా పోస్ట్ పొడిగించబడుతుంది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, వేతనాలు, ఎంపిక విధానం మొదలైన ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారం కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

SA Preparation Tips: ఉపాధ్యాయ కొలువు సాధించాలంటే.. ఈ పుస్తకాలను చదివేయండి.. కొలువు పక్కా..!


సంస్థ పేరు: సెంట్రల్ సిల్క్ బోర్డ్ (CSB)

పోస్టుల సంఖ్య: 3

ఉద్యోగం స్థానం: బెంగళూరు

పోస్ట్ పేరు: కన్సల్టెంట్

                       పోస్టు పేరు                                     పోస్టుల సంఖ్య       వయో పరిమితి 
కన్సల్టెంట్ (Law & Labour)                1                 64
కన్సల్టెంట్ (Technical Division)                1                 64
కన్సల్టెంట్ (Establishment Section                1                 64


 


అర్హతలు

ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేసి.. ఇండియన్ లా సర్వీసెస్ నుండి రిటైర్డ్ అయిన అధికారులు అర్హులు. వీటికి పది సంవత్సరాల పని అనుభవం ఉండాలి. రిటైర్డ్ పర్సన్స్ ను దీనికి అర్హులుగా పేర్కొన్నారు. ఇతర వివరాలకు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు:

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 19 జూలై 2022

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 09 ఆగస్టు 2022

దరఖాస్తు సమర్పణ ప్రక్రియ

-2022 నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివి.. అభ్యర్థి అర్హత ప్రమాణాలకు తగిన విధంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి.

- కమ్యూనికేషన్ ప్రయోజనం కోసం సరైన ఈ మెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ , వయస్సు, విద్యార్హత, ఇటీవలి ఫోటోగ్రాఫ్, రెజ్యూమ్, అనుభవం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. వాటి జిరాక్స్ కాపీలను తీసుకోవాలి.

- అధికారిక నోటిఫికేషన్ నుండి అందుబాటులో ఉన్న  దరఖాస్తు ఫారమ్‌ ను ప్రింట్ తీసుకొని వివరాలను నింపాలి.

మొత్తం సమాచారాన్ని పూర్తి చేసిన తర్వాత..  అందించిన వివరాలు సరైనవో కాదో చూసుకొని..  స్పీడ్ లేదా రిజిస్టర్‌ పోస్టు ద్వారా సెక్రటరీ, సెంట్రల్ సిల్క్ బోర్డ్, BTM లేఅవుట్, మడివాలా, హోసూర్ రోడ్, బెంగళూరు – 560068, కర్ణాటక  చిరునామాకు పంపించాలి.

Published by:Veera Babu
First published:

Tags: Bangalore, Career and Courses, JOBS, Silk board

ఉత్తమ కథలు