హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Head Constable Jobs: గుడ్ న్యూస్.. 322 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. 

Head Constable Jobs: గుడ్ న్యూస్.. 322 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. 

Head Constable Jobs: గుడ్ న్యూస్.. 322 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. 

Head Constable Jobs: గుడ్ న్యూస్.. 322 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. 

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 322 హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అర్హత గల దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ crpf.gov.in ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో నవంబర్ 22, 2022 లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 322 హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అర్హత గల దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ crpf.gov.in ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో 21/11/2022న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. స్పోర్ట్స్ పనితీరు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లు, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్‌లు, మెరిట్ లిస్ట్‌లు, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ మరియు రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్‌ల ఆధారంగా పోస్టుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హతను పూర్తి చేసిన అభ్యర్థులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి, వయోపరిమితి, విద్యార్హత మరియు అర్హతల వివరాలు ఇక్కడ తులుసుకోండి.

మొత్తం ఖాళీ పోస్టులు 322

పురుషులకు- 257, మహిళలకు-65 పోస్టులను కేటాయించారు.

విభాగంపురుషులుమహిళలు
అర్చరీ0204
అథ్లెటిక్స్4208
బ్యాడ్మింటన్0602
బాస్కెట్‌బాల్06-
బాడీబిల్డింగ్14-
బాక్సింగ్1403
ఫుట్‌బాల్0403
జిమ్నాస్టిక్స్09
హ్యాండ్‌బాల్04
హాకీ0904
జూడో1304
కబడ్డీ0903
కరాటే0703
షూటింగ్18-
ఈత1604
వాటర్ పోలో04
ట్రయాథ్లాన్02
టైక్వాండో1104
వాలీబాల్0603
వాటర్ గేమ్స్1406
వెయిట్ లిఫ్టింగ్0704
రెజ్లింగ్ (ఫ్రీ స్టైల్)0907
రెజ్లింగ్ (గ్రీకో రోమన్)07
వుషు2403

దరఖాస్తుకు చివరి తేదీ: రిక్రూట్‌మెంట్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వయో పరిమితి.. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.  జీతం ఎంపికై అభ్యర్థులకు నెలకు వేతనం రూ.25,500 నుంచి రూ.81,100 ఉంటుంది.

CAT: క్యాట్‌ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ మీ టార్గెటా..? క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ ప్రిపరేషన్ ఇలా..

అర్హతలు:హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) అభ్యర్థులు 12వ తరగతి లేదా తత్సమానం పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: క్రీడా ప్రదర్శన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్  ఆధారంగా ఉంటుంది.

పోస్టుల కోసం దరఖాస్తు ఇలా.. 

-ముందుగా అభ్యర్థులు CRPF వెబ్‌సైట్ www.crpf.gov.inని సందర్శించండి.

-దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.

-దరఖాస్తు ఫారమ్ లో సంబంధిత సరైన వివరాలతో ఫారమ్‌ను పూరించండి.

-అవసరమైన పత్రాల యొక్క అన్ని జిరాక్స్ కాపీలను అటాచ్ చేయండి.

-తర్వాత దరఖాస్తు ఫీచు చెల్లించండి. రుసుము తప్పనిసరిగా పోస్టల్ ఆర్డర్/డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.

IGNOU Admissions 2022: ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు మరోసారి పెంపు.. ఎప్పటివరకంటే..

-APPLICATION FOR THE RECRUITMENT OF SPORTSPERSON IN CRPF AGAINST SPORTS QUOTA-2022 ఎన్వలప్‌పై పోస్ట్ పేరును తప్పనిసరిగా పేర్కొనాలి.

-నోటిఫికేషన్‌లో పేర్కొన్న చిరునామాకు దరఖాస్తు తప్పనిసరిగా చేరుకోవాలి.

నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: Career and Courses, CRPF, JOBS, Sports

ఉత్తమ కథలు