హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Constable Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 400 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

Constable Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 400 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

Constable Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 400 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

Constable Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 400 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. మొత్తం 400 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. మొత్తం 400 పోస్టులను ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఖాళీలను GD కానిస్టేబుల్ పోస్ట్ కోసం తీసుకోనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అక్టోబర్ 03 వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.  అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 22, 2022 వరకు ర్యాలీలు నిర్వహించబడతాయి. ఛత్తీస్‌గఢ్ పోలీస్ కింద బీజాపూర్, దంతేవాడ అండ్ సుక్మాతో సహా ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ జిల్లాల్లో మొత్తం 400 మంది అభ్యర్థులను నియమించనున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య 400

బీజాపూర్ - 128 పోస్టులు

దంతేవాడ - 144 పోస్టులు

సుక్మా - 128 పోస్ట్‌లు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యార్హత కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థులు గోడి లేదా హల్బీని రాయడం , మాట్లాడటం రావాలి. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలను చదవాలని సూచించారు. విచారణ కోసం హెల్ప్‌లైన్ నంబర్ కూడా జారీ చేశారు. వీటిని వెబ్ సైట్లో పొందొచ్చు.

TSPSC Notification: నిరుద్యోగులకు అలర్ట్... 833 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయోపరిమితి 18 మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు. ST అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల సడలింపు ఇవ్వబడుతుంది.

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21700 నుండి రూ. 69100 వరకు జీతం ఇవ్వబడుతుంది.

Top 10 Skills To Get Job: ఉద్యోగ సాధనలో ఉపయోగపడే టాప్ 10 నైపుణ్యాలు ఇవే.. నివేదిక విడుదల చేసిన లింక్డ్‌ఇన్ ..

ముఖ్యమైన తేదీలు

ప్రకటన ప్రచురణ తేదీ : 20 సెప్టెంబర్ 2022

దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 03 అక్టోబర్ 2022

ర్యాలీ ప్రారంభ తేదీ 10 అక్టోబర్ 2022, ముగింపు తేదీ అక్టోబర్ 22, 2022.

దరఖాస్తు ఫీజు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.

శారీరక ప్రమాణాలు ఇలా ఉండాలి

ఎత్తు - 153 సెం.మీ

ఛాతీ - 74.5 సెం.మీ

బరువు - ఎత్తుకు తగ్గట్లు ఉండాలి.

ఫిజికల్ ఎఫిషియెన్సీ

పరుగు - 24 నిమిషాల్లో 5 కి.మీ పరుగెత్తాల్సి ఉంటుంది.

దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకునే విధానం..

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

-ఇక్కడ కెరీర్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

IT Jobs 2022: ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా.. ఈ కంపెనీలో 10 వేల ఖాళీలకు నియామకాలు..

-దీనిలో Advertise Number R.II-6/2022-CGS-Adm-V ను ఎంచుకోవాలి.

-దీనిలో నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. ఈ పీడీఎఫ్ లో నోటిఫికేషన్ తో పాటు.. అప్లికేషన్ ఫారమ్ కూడా ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదువుకొని.. అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.

-ఆ అప్లికేషన్ లో వివరాలను నింపి.. అర్హత సర్టిఫికేట్ల జిరాక్స్ లను జత చేసి.. నోటిఫికేషన్ లో పేర్కొన్న అడ్రస్ కు అక్టోబర్ 3 లోపు దరఖాస్తులు పంపాలి.

-పూర్తి నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Police jobs, Telangana constable

ఉత్తమ కథలు