రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టింది సెంట్రల్ రైల్వే. కొద్దిరోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. డయాలిసిస్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది సెంట్రల్ రైల్వే. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మే 27 నుంచి మే 29 వరకు నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. సూచించిన ఫార్మాట్లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. సెంట్రల్ రైల్వే తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
Central Railway Recruitment: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం పోస్టులు: 42
స్టాఫ్ నర్స్: 34
డయాలిసిస్ టెక్నీషియన్: 7
ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్: 1
వాక్-ఇన్ ఇంటర్వ్యూ: మే 27 నుంచి మే 29
image: Central Railway
Central Railway Recruitment: వయస్సు, విద్యార్హతల వివరాలు
స్టాఫ్ నర్స్: బీఎస్సీ నర్సింగ్ లేదా మూడేళ్ల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ పాస్ కావడంతో పాటు నర్స్ అండ్ మిడ్వైఫ్ సర్టిఫికెట్ ఉండాలి. వయస్సు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
డయాలిసిస్ టెక్నీషియన్: బీఎస్సీతో పాటు హెమోడయాలిసిస్లో డిప్లొమా లేదా రెండేళ్ల హౌజ్ ట్రైనింగ్, ప్రముఖ ఇన్స్టిట్యూట్లో హెమోడయాలిసిస్లో అనుభవం తప్పనిసరి. వయస్సు 20 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్: బీఎస్సీ, డిప్లొమా ఇన్ ఆడియో అండ్ స్పీచ్ థెరపీతో పాటు సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి. వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.