Home /News /jobs /

CENTRAL RAILWAY RECRUITMENT 2021 WALK IN INTERVIEWS VARIOUS JOB VACANCIES ON JAN 11 HERE FULL DETAILS NS

Railway Recruitment 2022: రైల్వేలో రూ.95 వేల భారీ వేతనంతో జాబ్స్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. ఎల్లుండే ఇంటర్వ్యూలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ రైల్వే (Central Railway) పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Railway Jobs Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 11న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    ఇటీవల రైల్వే ఉద్యోగాల (Railway Jobs) భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. తాజాగా ఇండియన్ రైల్వేకు (Indian Railways) చెందిన సెంట్రల్ రైల్వే పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఖాళీల భర్తీకి ఎలాంటి ఎగ్జామ్ లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారు మూడు నెలల పాటు పని చేయాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితుల దృష్ట్యా కాంట్రాక్ట్ గడువు పొడిగించవచ్చు.
    RRB NTPC Results: వారం రోజుల్లో రైల్వే ప‌రీక్ష ఫ‌లితాలు.. రిజ‌ల్ట్ పాట‌ర్న్‌.. క‌ట్ ఆఫ్‌ వివ‌రాలు

    ఖాళీలు వివరాలు:
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఫిజీషియన్ విభాగంలో 4, Anaesthetist/ Intensivists విభాగంలో 4, GDMO విభాగంలో మరో నాలుగు ఖాళీలు ఉన్నాయి.
    Currency Note Press Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. కరెన్సీ నోట్ ప్రెస్ లో 149 జాబ్స్.. ఇలా అప్లై చేయండి

    విద్యార్హతల వివరాలు:
    స్పెషలిస్ట్స్: ఎంబీబీఎస్ విద్యార్హత కలిగి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో గుర్తింపు పొందిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    GDMO: ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు అప్లై చేసుకుంటున్న వారి వయస్సు జనవరి 1 నాటికి 53 ఏళ్లు దాట కూడదని నోటిఫికేషన్లోస్పష్టం చేశారు.
    Army Public School Jobs: సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    వేతనాల వివరాలు:
    CMP (GDMO) MBBS Doctor: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.75 వేల వేతనం చెల్లించనున్నారు.
    ఫిజీషియన్: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.95 వేల వేతనం చెల్లించనున్నారు.
    Anaesthetist/Intensivist: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.95 వేల వేతనం చెల్లించనున్నారు.


    ఇంటర్వ్యూ వివరాలు:
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను ఈ నెల 11న నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆ రోజు ఉదయం 11 గంటలకు Bharatratna Dr. Babasaheb Ambedkar Memorial Hospital, Central Railway, Bycullam, Mumbai-400027 చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government, Indian Railway, Job notification, Mumbai, Railway jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు