హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... దరఖాస్తు ప్రారంభం

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... దరఖాస్తు ప్రారంభం

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... దరఖాస్తు ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... దరఖాస్తు ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

Central Railway Recruitment 202 | సెంట్రల్ రైల్వే పలు ఖాళీల భర్తీకి (Railway Jobs) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, అప్లికఏషన్ ప్రాసెస్ తెలుసుకోండి.

  భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. సెంట్రల్ రైల్వే (Central Railway) ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 21 పోస్టుల్ని ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 27 చివరి తేదీ. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి పలు క్రీడల్లో రాణించినవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, విద్యార్హతలు, ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.

  Central Railway Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు21విద్యార్హతలు
  లెవెల్ 5/43గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి.
  లెవెల్ 3/21812వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. లేదా మెట్రిక్యులేషన్ + కోర్స్ ఉన్నవారు యాక్ట్ అప్రెంటీస్‌షిప్ పాస్ కావాలి. లేదా మెట్రిక్యులేషన్ + ఐటీఐ పాస్ కావాలి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్‌ను అర్హతగా పరిగణించరు.


  Jobs in TCS: కరోనా టైమ్‌లో బీటెక్ పాస్ అయినవారికి టీసీఎస్‌లో జాబ్స్... రేపే లాస్ట్ డేట్

  Central Railway Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2021 డిసెంబర్ 13

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 27 సాయంత్రం 5 గంటలు

  విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి.

  క్రీడార్హతలు- లెవెల్ 5/4 పోస్టులకు బాస్కెట్ బాల్, బాక్సింగ్, హాకీ, లెవెల్ 3/2 పోస్టులకు వాటర్ పోలో, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్రికెట్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ లాంటి క్రీడల్లో రాణించాలి.

  వయస్సు- 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు.

  దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.250.

  ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  BEL Recruitment 2021: హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్‌లో భారీగా ఉద్యోగాలు... రూ.50,000 వరకు వేతనం

  Central Railway Recruitment 2021: దరఖాస్తు విధానం


  Step 1- అభ్యర్థులు https://rrccr.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Step 2- హోమ్ పేజీలో Click here to Apply Online పైన క్లిక్ చేయాలి.

  Step 3- ఆ తర్వాత CLICK HERE TO REGISTER పైన క్లిక్ చేయాలి.

  Step 4- అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

  Step 5- రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత లాగిన్ కావాలి.

  Step 6- లాగిన్ అయిన తర్వాత విద్యార్హతల వివరాలు, అడ్రస్ వివరాలు ఎంటర్ చేయాలి.

  Step 7- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

  Step 8- వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

  Step 9- దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Railway Apprenticeship, Railway jobs, Railways

  ఉత్తమ కథలు