CENTRAL RAILWAY RECRUITMENT 2021 APPLICATIONS INVITING FOR 21 POSTS HERE FULL DETAILS NS
Central Railway Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
ప్రతీకాత్మక చిత్రం
సెంట్రల్ రైల్వే నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుకు ఈ నెల 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సెంట్రల్ రైల్వే (Central Railway) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Railway Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించించింది. ఈ మేరకు సెంట్రల్ రైల్వేకు చెందిన రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో (Sports Quota Jobs) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. లెవల్ 5/4, లెవల్ 3/2 విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.
అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫీజు:అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ. 500లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్/PwD/ఉమెన్ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.