Railway Jobs: రైల్వేలో 2150 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Central Railway Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్, కమర్షియల్ క్లర్క్, పాయింట్‌మెన్, సీనియర్ క్లర్క్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది మధ్య రైల్వే.

news18-telugu
Updated: July 11, 2019, 10:26 AM IST
Railway Jobs: రైల్వేలో 2150 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
Railway Jobs: రైల్వేలో 2150 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు మరో అవకాశం కల్పిస్తోంది భారతీయ రైల్వే. ఉద్యోగం నుంచి రిటైరైన వారి సేవల్ని వినియోగించుకోవాలని భావిస్తోంది. మొత్తం 2167 పోస్టుల భర్తీకి మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులు రైల్వేలో రిటైరైన వారికి మాత్రమే. దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్, కమర్షియల్ క్లర్క్, పాయింట్‌మెన్, సీనియర్ క్లర్క్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది మధ్య రైల్వే. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మధ్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Central Railway Recruitment 2019: ఖాళీల వివరాలివే...



మొత్తం పోస్టులు- 2150
మెడికల్- 11
కమర్షియల్- 150
సివిల్- 304
ఎలక్ట్రికల్- 249ఆపరేటింగ్- 385
పర్సనల్- 3
మెకానికల్-35
ఎస్ అండ్ టీ- 228
ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ కేవైఎన్- 274
సీనియర్ సీడీఓ ఎల్‌టీటీ- 82
డీఎస్ఎల్ సీఎల్ఏ- 20
ట్రాక్షన్- 186
ఎలక్ట్రికల్ టీఆర్ఎస్‌ సీఎల్ఏ- 240

Central Railway Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 19
దరఖాస్తు ముగింపు: 2019 జూలై 12
వయస్సు: 01.12.2019 నాటికి 65 ఏళ్లు

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
Published by: Santhosh Kumar S
First published: July 11, 2019, 10:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading