Railway Jobs: రైల్వేలో జాబ్స్... మార్చి 6 చివరి తేదీ

Central Railway JTA Recruitment 2020 | సెంట్రల్ రైల్వే జూనియర్ టెక్నికల్ అసోసియేట్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 4, 2020, 11:40 AM IST
Railway Jobs: రైల్వేలో జాబ్స్... మార్చి 6 చివరి తేదీ
Railway Jobs: రైల్వేలో జాబ్స్... మార్చి 6 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వేలో టెక్నికల్ పోస్టులు కోరుకునేవారికి శుభవార్త. జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. 37 ఖాళీలను ప్రకటించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. సెలెక్ట్ అయినవారు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 6 చివరి తేదీ. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అప్లికేషన్ ఫామ్ మార్చి 13 లోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు https://cr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Central Railway JTA Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


జూనియర్ టెక్నికల్ అసోసియేట్ మొత్తం ఖాళీలు- 37

దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 6 సాయంత్రం 5 గంటలు
అప్లికేషన్ ప్రింట్ అవుట్ పంపడానికి చివరి తేదీ- 2020 మార్చి 13 సాయంత్రం 5 గంటలు


విద్యార్హత- సివిల్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా లేదా బీఎస్సీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు.వయస్సు- 33 ఏళ్ల లోపు
వేతనం- రూ.25,000 నుంచి రూ.30,000
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250, మహిళలకు రూ.250.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే సంస్థలో 182 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BIS Recruitment 2020: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 150 జాబ్స్... ఖాళీల వివరాలివే

Telangana Jobs: తెలంగాణ మైనారిటీ కాలేజీల్లో 1,000 పైగా ఉద్యోగాలు
First published: March 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు