JEE Main 2021 Schedule: విద్యార్థులకు అలర్ట్... జేఈఈ మెయిన్ 2021 షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ మెయిన్-2021 పరీక్ష నూతన షెడ్యూల్ ను కేంద్రం తాజాగా వెల్లడించింది. నూతన షెడ్యూల్ వివరాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తాజాగా విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    జేఈఈ మెయిన్-2021 పరీక్ష నూతన షెడ్యూల్ ను కేంద్రం తాజాగా వెల్లడించింది. నూతన షెడ్యూల్ వివరాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తాజాగా విడుదల చేశారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు మొదటి జేఈఈ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మరో మూడు సార్లు పరీక్షను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పరీక్ష అనంతరం నాలుగైదు రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. అయితే.. మంగళవారం సైతం జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసి వెంటనే తొలగించారు. ఇక మీదట ఈ ఏడాది జేఈఈ పరీక్షకు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు పరీక్షలో చేసిన మార్పులను గమచించాల్సి ఉంటుంది.

    మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం నుంచి జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ను నాలుగు సార్లు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఏడాదికి రెండు సార్లే ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. జనవరిలో, ఏప్రిల్‌లో రెండుసార్లు మాత్రమే ఎగ్జామ్ జరిగేది. అయితే ఏడాదిలో జేఈఈ మెయిన్ నాలుగు సార్లు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ డిసెంబర్ 10న విద్యార్థులతో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయడంతో విద్యార్థుల సందేహాలు తీరిపోయాయి.

    ఫిబ్రవరి సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడా జేఈఈ మెయిన్ 2021 పరీక్షను నిర్వహించనున్నారు. ప్రతీ నెల రెండు వారాల పాటు ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రాంతీయ భాషల్లో కూడా జేఈఈ మెయిన్ నిర్వహిస్తారు. 12 భాషల్లో ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మళయాళం, ఒడియా, పంజాబీ, తమిళ్ భాషల్లో ఎగ్జామ్ ఉంటుంది. పరీక్షలు ముగిసిన నాలుగైదు రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తారు. కాబట్టి విద్యార్థులు తర్వాతి నెలలో పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్‌లో వచ్చిన ర్యాంక్స్‌ని బట్టి అడ్మిషన్లు లభిస్తాయి.
    Published by:Nikhil Kumar S
    First published: