హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Advanced 2021 Dates: జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీలను ప్రకటించిన కేంద్ర మంత్రి.. ఆ నిబంధన రద్దు

JEE Advanced 2021 Dates: జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీలను ప్రకటించిన కేంద్ర మంత్రి.. ఆ నిబంధన రద్దు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Advanced 2021 పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు.

  JEE Advanced 2021 పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. ఈ రోజు సాయంత్రి నిర్వహించిన ట్విట్టర్ లైవ్ ద్వారా మంత్రి ఆ వివరాలను వెల్లడించారు. జూలై 3న ఆ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐఐఐటీ ఖరగ్ పూర ఆ పరీక్ష నిర్వహిస్తుందని వెల్లడించారు. ఇంటర్లో 75 శాతం మార్కులను తప్పనిసరిగా సాధించాలన్న నిబంధనను కూడా ఈ సారి ఎత్తేసినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో గతేడాది జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణ సాధించి, అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కాలేక పోయిన వారు ఈ సారి నేరుగా అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. జేఈఈ మెయిన్-2021 పరీక్ష నూతన షెడ్యూల్ ను కేంద్రం ఇటీవల వెల్లడించింది. నూతన షెడ్యూల్ వివరాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు మొదటి జేఈఈ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మరో మూడు సార్లు పరీక్షను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

  పరీక్ష అనంతరం నాలుగైదు రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. అయితే.. అంతకు ముందు ఓ సారి జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసి వెంటనే తొలగించారు. ఇక మీదట ఈ ఏడాది జేఈఈ పరీక్షకు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు పరీక్షలో చేసిన మార్పులను గమచించాల్సి ఉంటుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Exams, JEE Main 2021

  ఉత్తమ కథలు