Jobs: సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... హైదరాబాద్‌ రీజియన్‌లో ఖాళీలు

Central Government Jobs | దరఖాస్తుల్ని పోస్టు ద్వారా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://cgwb.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: April 7, 2020, 3:14 PM IST
Jobs: సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... హైదరాబాద్‌ రీజియన్‌లో ఖాళీలు
Jobs: సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... హైదరాబాద్‌ రీజియన్‌లో ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బోర్డు-CGWB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 62 ఖాళీలను ప్రకటించింది. వీటిలో హైదరాబాద్‌ రీజియన్‌లో 5 పోస్టులున్నాయి. జియాలజీ, ఎర్త్ సైన్స్, హైడ్రాలజీ విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన నీటివనరులు, నది అభివృద్ధి, గంగ పునరుజ్జీవనం విభాగంలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు ఏప్రిల్ 25 చివరి తేదీ. దరఖాస్తుల్ని పోస్టు ద్వారా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://cgwb.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

CGWB Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...మొత్తం ఖాళీలు- 62
యంగ్ ప్రొఫెషనల్- 48
కన్సల్టెంట్- 14
దరఖాస్తుకు చివరి తేదీ- ఏప్రిల్ 25 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ. కన్సల్టెంట్ పోస్టుకు 10 ఏళ్ల అనుభవం తప్పనిసరి.వయస్సు- 30 నుంచి 65 ఏళ్లు
నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... విశాఖపట్నంతో పాటు ఇతర నగరాల్లో ఖాళీలు

Jobs: బీటెక్ పాసైతే ఈ 259 జాబ్స్‌కు అప్లై చేయండి... వివరాలివే

Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని షిప్‌యార్డ్‌లో జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

HDFC Bank Jobs: డిగ్రీ పాసైతే చాలు... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగాలు
First published: April 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading