హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండిలా...జీతం రూ.35 వేలు...

Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండిలా...జీతం రూ.35 వేలు...

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

భారత అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని Directorate of Atomic Minerals for Exploration and Research (AMD / AMDER) వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి. భారత అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని Directorate of Atomic Minerals for Exploration and Research (AMD / AMDER) వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే మొత్తం 124 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టుల్లో సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, అప్పర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి గానూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక వేతనం విషయానికి వస్తే కనీసం 18000 నుంచి గరిష్టంగా 35 వేల వరకూ లభించే వీలుంది.

మొత్తం ఖాళీలు: 124

పోస్టులు: సైంటిఫిక్ అసిస్టెంట్-బి, టెక్నీషియన్-బి, అప్పర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ తదితరాలు

విభాగాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియోలజీ, ఎలక్ట్రాని క్స్/ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రికల్, సివిల్, ల్యాబొరేటరీ, ప్లంబర్ తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ/ఎన్‌సీవీటీ, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఎస్సీ, ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతభత్యా లు: నెలకు రూ.18,000 నుంచి రూ.35,400 - వరకు చెల్లిస్తారు

- ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్కిల్ టెస్ట్/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలకు ఫీజు లేదు. ఇతరులు పోస్టుల్ని అనుసరించి రూ.100 నుంచి రూ.200 వరకు చెల్లించాలి

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 24

వెబ్ సైట్: https://www.amd.gov.in/

First published:

Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, JOBS

ఉత్తమ కథలు