హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... త్వరలో 4,76,692 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... త్వరలో 4,76,692 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... త్వరలో 4,76,692 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... త్వరలో 4,76,692 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

Central Government Jobs | కేంద్ర ప్రభుత్వం మీ కలా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోరుకుంటున్నారా? త్వరలో భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద శుభవార్త చెప్పింది. త్వరలో 4,76,692 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు ఈ విషయాన్ని తెలిపారు. త్వరలో 4,75,000 పైగా పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు వివరించారు. 2019-20 సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB మొత్తం 1,34,785 పోస్టుల్ని భర్తీ చేయాలని సిఫార్సు చేసినట్టు జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా వివరించారు. యూపీఎస్‌సీ ద్వారా 4,399 ఖాళీలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 13,995 ఖాళీలు, ఆర్ఆర్‌బీ ద్వారా 1,16,391 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు.

  యూపీఎస్‌సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్‌బీ మాత్రమే కాదు... రక్షణశాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ద్వారా అదనంగా మరో 3,41,907 పోస్టుల్ని భర్తీ చేస్తామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఖాళీల వివరాలను యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ లాంటి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు తెలపాలని కోరినట్టు వివరించారు. కేంద్ర సహాయ మంత్రి రాజ్యసభకు వివరించిన దాన్నిబట్టి కేంద్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. కాబట్టి నిరుద్యోగులు ఎప్పటికప్పుడు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు జారీ చేసి జాబ్ నోటిఫికేషన్లపై దృష్టి పెట్టడం మంచిది.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

  Telangana Jobs: తెలంగాణ మైనారిటీ కాలేజీల్లో జాబ్స్... 1,000 పైగా పోస్టుల భర్తీ

  Jobs: గుడ్ న్యూస్... 4,000 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Defence Ministry, Exams, India post, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, RRB, Staff Selection Commission, UPSC

  ఉత్తమ కథలు