Home /News /jobs /

CENTRAL GOVERNMENT SET UP A COMMITTEE TO MERGE UGC AND AICTE OFFICES GH SRD

NEP 2020: యూజీసీ, ఏఐసీటీఈ స్థానంలో కొత్తగా హెచ్‌ఈసీఐ.. రోడ్ మ్యాప్ కోసం కమిటీ ఏర్పాటు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEP 2020: ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో విప్లవాత్మకమైన మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న యూజీసీ, ఏఐసీటీఈలను విలీనం చేసి, ఉమ్మడిగా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (HECI) పేరుతో ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఎడ్యుకేషన్ సిస్టమ్‌ (Education System)లో విప్లవాత్మకమైన మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం (Central Government) 2020లో కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న యూజీసీ (UGC), ఏఐసీటీఈ (AICTE)లను విలీనం చేసి, ఉమ్మడిగా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (HECI) పేరుతో ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందు‌కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. * కమిటీ వివరాలు.. UGC, AICTE ఒకే నియంత్రణ సంస్థగా కలిసి పనిచేయడానికి ఈ కమిటీ రోడ్‌మ్యాప్‌ను తయారు చేయనుంది. ఈ కమిటీకి యూజీసీ చైర్మన్ అధ్యక్షత వహించనున్నారు. యూజీసీ ఏఐసీటీఈ వైస్-ఛైర్‌పర్సన్లు, యూజీసీ కార్యదర్శి, AICTE మెంబర్-సెక్రటరీ ఇందులో సభ్యులుగా ఉన్నారు. కీలకమైన అంశాల్లో పర్యవేక్షించేందుకు సబ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. * ముందుగా విలీనం అయ్యే విభాగాలు .. రీసెర్చ్ అండ్ ఇనోవేషన్, ఇ-గవర్నెన్స్, ప్రాంతీయ భాషల్లోకి పుస్తకాల ట్రాన్స్‌లేషన్, ఎగ్జామినేషన్ రిఫామ్స్ వంటి కీలక భాగాలను విలీనం చేయనున్నారు. టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ కోసం ఏఐసీటీఈ.. యూనివర్సిటీలు నాన్-టెక్నికల్ కాలేజీల కోసం యూజీసీ ప్రస్తుతానికి ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. * శీతాకాల సమావేశాల్లో బిల్లు.. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఈసీఐ) ఏర్పాటుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జాతీయ విద్యా విధానం -2020 ప్రకారం..ఈ HECI ఉన్నత విద్య కోసం ఒకే గొడుగు సంస్థగా ఉంటుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), నేషనల్ కౌన్సిల్‌ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (NCTE) వంటి సంస్థలు HECIలో విలీనం కానున్నాయి. ఇది కూడా చదవండి : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా 2500 మందికి ఉద్యోగాలు.. ఈ విషయంపై తాజాగా స్పందించారు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, విద్యార్థులు -అధ్యాపకుల ఇండక్షన్ ప్రోగ్రామ్, స్కిల్ డెవలప్‌మెంట్, ఇంటర్న్‌షిప్‌లతో పాటు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, యూనివర్సిల్ హ్యుమన్ వాల్యూస్ వంటి వాటిలో ఫిజికల్, ఆన్‌లైన్, హైబ్రిడ్ మోడ్‌లో ఒకేసారి రెండు డిగ్రీలను అభ్యసించడం వంటి అంశాల్లో యూజీసీ, ఏఐసీటీఈ ఇకపై పరస్పరం కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఈ మేరకు టెక్నికల్ ఎడ్యుకేషన్ బ్యూరో హెడ్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్లందరితో ఇటీవల జరిగిన సమావేశం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. AICTE చీఫ్‌గా ఉన్న అనిల్ సహస్రబుధే ఇటీవల రిటైర్ అయ్యారు. ఆయన్ను నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్ (NETF) చీఫ్‌గా నియమించారు. స్కూల్స్, ఉన్నత విద్యా సంస్థల్లో సాంకేతిక సంబంధించిన విషయాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. కాగా, ఉన్నత విద్యా సంస్థలను పర్యవేక్షించడానికి ఉమ్మడి సంస్థగా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (HECI) ను ఏర్పాటు చేయాలని 2018లోనే ప్రతిపాదనలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అడుగులు ముందుకు పడుతున్నాయి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Aicte, Career and Courses, Central Government, EDUCATION, JOBS, UGC

తదుపరి వార్తలు