కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-NRA ఏర్పాటు చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-NRA ఏర్పాటు చేసేందుకు రూ.1,517.57 కోట్లను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో, ప్రభుత్వ బ్యాంకుల్లో నాన్ గెజిటెడ్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-NRA కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET నిర్వహిస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB కోసం ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET జరుగుతుంది. అభ్యర్థులు ఇన్నాళ్లూ ఈ సంస్థలు నిర్వహించే పరీక్షలకు వేర్వేరుగా హాజరవ్వాల్సి వచ్చేది. కానీ వీటన్నింటికీ ఒకే పరీక్షను నిర్వహించడమే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET ఉద్దేశం. దీని వల్ల అభ్యర్థుల విలువైన సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుంది.
కేంద్ర ప్రభుత్వంలోని శాఖలు, ప్రభుత్వ బ్యాంకుల్లో గ్రూప్ బీ (నాన్ గెజిటెడ్), గ్రూప్ సీ (నాన్ టెక్నికల్), క్లరికల్ పోస్టుల భర్తీ కోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-NRA కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET నిర్వహిస్తుంది. అది కూడా మూడు లెవెల్స్‌లో వేర్వేరుగా ఉంటుంది. అంటే టెన్త్ పాసైనవారికి, ఇంటర్ పాసైనవారికి, డిగ్రీ అర్హత ఉన్నవారికి సెట్ వేర్వేరుగా ఉంటుంది. సెట్లో సాధించిన స్కోర్ ఆధారంగా ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ మొదటి దశను క్లియర్ చేయొచ్చు. ఆ తర్వాత రెండో దశ, మూడో దశ, ఇంటర్వ్యూ లాంటి వాటిని ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ సొంతగా నిర్వహిస్తాయి. అంటే ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ నిర్వహించే మొదటి దశ పరీక్ష వేర్వేరుగా కాకుండా కామన్‌గా ఉంటుంది.
SSC CGL Notification 2021: డిగ్రీ పాసయ్యారా? 6506 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి... సిలబస్ ఇదే
Army Recruitment Rally: హకీంపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ... ఇలా అప్లై చేయండి
నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-NRA నిర్వహించే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET కోట్లాది మంది యువతకు వరం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సెట్లో సాధించిన స్కోర్‌కు మూడేళ్ల వేలిడిటీ ఉంటుంది. స్కోర్ పెంచుకోవడానికి గరిష్ట వయోపరిమితిలోపు ఎన్నిసార్లైనా అటెంప్ట్ చేయొచ్చు. ఈ టెస్టుకు కరిక్యులమ్ కూడా కామన్‌గా ఉంటుంది. అంటే వేర్వేరు పరీక్షలకు వేర్వేరుగా చదవాల్సిన అవసరం లేకుండా సెట్ కోసం ఒకే సిలబస్ ప్రిపేర్ అయితే చాలు. సెట్ అన్ని భాషల్లో ఉంటుంది. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా సెట్ రాయొచ్చు.
Extra Income: జీతం సరిపోవట్లేదా? ఈ 11 మార్గాల ద్వారా మరింత డబ్బు సంపాదించండి
Railway Concessions: విద్యార్థులు, నిరుద్యోగులకు రైలులో ఉచిత ప్రయాణం, టికెట్లలో రాయితీ... ఎవరికి ఎంతంటే
ఇక ఎగ్జామ్ సెంటర్ కూడా ఎక్కడ ఉంటుందో అన్న టెన్షన్ అవసరం లేదు. ప్రతీ జిల్లా కేంద్రంలో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-NRA. అంటే అభ్యర్థులు పరీక్ష రాయాలంటే తమకు దగ్గర్లో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్తే చాలు. దీని వల్ల నిరుద్యోగులకు ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాదు... గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు, ఎక్కువ దూరం ప్రయాణించలేమని భావించే మహిళలు, యువతులు తమకు దగ్గర్లో ఉన్న పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ రాయొచ్చు. వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.