Home /News /jobs /

CENTRAL GOVERNMENT OFFERS NATIONAL OVERSEAS SCHOLARSHIP SCHEME FOR SCHEDULED CASTE STUDENTS SS

Scholarship: విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్... అప్లై చేయండిలా

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

National Overseas Scholarship | ప్రతిభ ఉన్నా ఆర్థిక సమస్యల వల్ల ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

    విదేశాల్లో చదువుకోవాలనుకునే షెడ్యూల్డ్ క్యాస్ట్ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ఆసక్తిగల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ http://nosmsje.gov.in/ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 మే 31 చివరి తేదీ.

    National Overseas Scholarship: స్కాలర్‌షిప్ వివరాలు ఇవే...


    మొత్తం స్కాలర్‌షిప్స్- 100
    విద్యార్హతలు- మాస్టర్ కోర్స్ చేయాలనుకునేవారు బ్యాచిలర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ చదవాలనుకునేవారు మాస్టర్స్ డిగ్రీ 55 శాతం మార్కులతో పాస్ కావాలి.
    వయస్సు- 2019 ఏప్రిల్ 1 నాటికి 35 ఏళ్ల లోపు ఉండాలి.
    వార్షికాదాయం- కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి.
    స్కాలర్‌షిప్- వార్షికంగా 15,400 డాలర్లు.
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 31
    గైడ్‌లైన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    IOCL Jobs: ఐఓసీఎల్‌ నుంచి రెండు జాబ్ నోటిఫికేషన్లు... దరఖాస్తు గడువు పొడిగింపు

    Job Loss: ఉద్యోగం పోయిందా? ప్రభుత్వం నుంచి సాయం పొందొచ్చు ఇలా

    Jobs: భారతదేశంలో డిమాండ్ ఉన్న 10 జాబ్స్ ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, EDUCATION, JOBS, Scholarship

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు