CBSE 12th board Exams 2021: సీబీఎస్ఈ పరీక్షలపై నేడు కీలక సమావేశం.. ఆ ప్రతిపాదనకే మొగ్గు చూపుతారా?

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఈ రోజు కేంద్ర మంత్రులు ఆయా రాష్ట్రాల మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు.

  • Share this:
    కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా సాగుతోంది. ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అనేక రాష్ట్రాలు సైతం పలు బోర్డు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం టెన్త్ పరీక్షలను రద్దు చేసింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించి ఫలితాలను సైతం విడుదల చేశారు అధికారులు. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే సెకండియర్ లోకి ప్రమోట్ చేసింది సర్కార్. అయితే ఇంటర్ సెకండియర్ పరీక్షల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జూన్ మొదటి వారంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు. అయితే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల విషయంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు 12 వ తరగతి పరీక్షలతో పాటు నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణ విషయంలో ఈ రోజు కేంద్ర మంత్రుల బృందం రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులతో చర్చించనుంది.
    Telangana Exams: విద్యార్థులకు అలర్ట్.. ఎల్లుండి నుంచే ఆ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ప్రారంభం.. వివరాలివే

    ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు విద్యాశాక మంత్రి రమేష్ పోఖ్రియాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, సమాచార శాక మంత్రి ప్రకాశ్ జవడేకర్ తదితరులు పాల్గొనున్నారు. వర్చువల్ విధానంలో ఈ మీటింగ్ జరగనుంది. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థులను సమీక్షించనున్నారు. పరీక్షల నిర్వహణపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. టీచర్లు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో కోరారు.

    ఇదిలా ఉంటే..  సీబీఎస్ఈ 12వ తరగతిలో మొత్తం 374 సబ్జెక్టులు ఉండగా వాటిలో ప్రధానమైన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనలపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను ఇతర సబ్జెక్టులకు కేటాయించాలని భావిస్తున్నారు. ఈ అంశంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే విద్యార్థులు మాత్రం పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో పరీక్షలను నిర్వహిస్తామనడం సరికాదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: