హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Govt Jobs: గుడ్ న్యూస్... ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్ ఉండవు... సెట్ మాత్రమే

Govt Jobs: గుడ్ న్యూస్... ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్ ఉండవు... సెట్ మాత్రమే

Govt Jobs: గుడ్ న్యూస్... ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్ ఉండవు... సెట్ మాత్రమే
(ప్రతీకాత్మక చిత్రం)

Govt Jobs: గుడ్ న్యూస్... ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్ ఉండవు... సెట్ మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)

Common Eligibility Test | కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET మాత్రమే రాస్తే చాలు. ఈ పరీక్షలో క్వాలిఫై అయినవాళ్లను ఖాళీగా ఉన్న పోస్టులకు ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వం తాజా ఆలోచన ఇది.

  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కలా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారా? మీకున్న అర్హతలతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS పరీక్షలు రాస్తుంటారా? ఇకపై కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులకు ఇలా వేర్వేరు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక పరీక్ష రాస్తే చాలు. అదే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET. అన్ని పోస్టులకూ ఈ ఒక్క పరీక్ష రాస్తే సరిపోతుంది. అంటే  రైల్వే ఉద్యోగం, బ్యాంకు ఉద్యోగం, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి కావాలన్నా వేర్వేరుగా పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ఒక పరీక్ష రాసి ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ప్రతీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయడం, ఫీజులు చెల్లించడం, ప్రిపేర్ కావడం, పరీక్ష రాయడం, ఫలితాల కోసం ఎదురుచూడటం లాంటి టెన్షన్స్ ఉండవు. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET మాత్రమే రాస్తే చాలు. ఈ పరీక్షలో క్వాలిఫై అయినవాళ్లను ఖాళీగా ఉన్న పోస్టులకు ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వం తాజా ఆలోచన ఇది.

  ఈ ఆలోచన కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది. ఒక ఏజెన్సీ కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహించాలన్నది ఆ ప్రతిపాదన. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం ఈ ఏజెన్సీ డిగ్రీ, ఇంటర్, టెన్త్ పాసైనవారికి వేర్వేరుగా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET నిర్వహిస్తుంది. ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS ఇవే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ మూడు పరీక్షలు రాయాల్సి వస్తుంది. వీటికి వేర్వేరుగా దరఖాస్తు చేయడం, ఫీజులు చెల్లించడం, పరీక్ష రాయడం వల్ల సమయం, డబ్బు అదనంగా ఖర్చవుతోంది. అభ్యర్థులకు ఈ ప్రయాస లేకుండా చేసేందుకే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET ప్రతిపాదన తెరపైకి వచ్చింది.  మరి ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  Anganwadi Jobs: అనంతపురం జిల్లాలో 513 అంగన్వాడీ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

  Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 328 ఉద్యోగాలు... బీటెక్, ఎంటెక్, బీఎస్సీ అర్హత

  Railways Jobs: సదరన్ రైల్వేలో 3429 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, Banking, CAREER, Central Government, Exams, IBPS, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railways, RRB, Staff Selection Commission

  ఉత్తమ కథలు