హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 3,10,832 ఉద్యోగాల భర్తీ

Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 3,10,832 ఉద్యోగాల భర్తీ

Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 3,10,832 ఉద్యోగాల భర్తీ
(ప్రతీకాత్మక చిత్రం)

Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 3,10,832 ఉద్యోగాల భర్తీ (ప్రతీకాత్మక చిత్రం)

Central Government Jobs | కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల నియామకాలు నిరంతరం జరిగే ప్రక్రియ. పోస్టుల్ని భర్తీ చేస్తున్నకొద్దీ కొత్తగా ఖాళీలు ఏర్పడుతుంటాయి. ఒక పోస్టు రెండుమూడేళ్లు ఖాళీగా ఉన్నట్టైతే ఆ పోస్టుని రద్దు చేస్తారు.

  కేంద్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోస్టల్ సర్వీస్ బోర్డ్, రక్షణ శాఖలు వేర్వేరుగా లక్షల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. ప్రస్తుతం 3,10,832 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అందులో డిఫెన్స్‌లో 27,652 పోస్టులున్నట్టు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు సమాచారం తెలిపింది. లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా సమాధానం తెలిపారు. ఖర్చుల విభాగానికి చెందిన పే రీసెర్చ్ యూనిట్ వార్షిక నివేదికను సమర్పించారు. 2018 మార్చి 1 నాటికి 38.02 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కేటాయించగా 31.18 లక్షల మంది సిబ్బంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. 6.83 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  2019-20 ఆర్థిక సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB మొత్తం 1.34 లక్షల పోస్టుల భర్తీకి సిఫార్సులు అందించాయి. యూపీఎస్‌సీ నుంచి 4,399 పోస్టులు, ఎస్ఎస్‌సీ నుంచి 13,995 పోస్టులు, ఆర్ఆర్‌బీ నుంచి 1.16 లక్షల పోస్టులకు సంబంధించి సిఫార్సులు వచ్చాయి. ఉద్యోగుల రిటైర్మెంట్, రాజీనామాలు, మృతి, ప్రమోషన్ కారణంగా ఏర్పడ్డ ఖాళీలివి. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల రిక్రూట్‌మెంట్ రూల్స్ ప్రకారం ఈ పోస్టుల్ని భర్తీ చేయాలి.

  కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల నియామకాలు నిరంతరం జరిగే ప్రక్రియ. పోస్టుల్ని భర్తీ చేస్తున్నకొద్దీ కొత్తగా ఖాళీలు ఏర్పడుతుంటాయి. ఒక పోస్టు రెండుమూడేళ్లు ఖాళీగా ఉన్నట్టైతే ఆ పోస్టుని రద్దు చేస్తారు. ఆ తర్వాత అవసరాలను బట్టి ఆ పోస్టుల్ని పునరుద్ధరిస్తారు. అయితే రైల్వేలో ఈ విధానం లేదు. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయాలంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సూచనలు చేస్తూ ఉంటుంది. ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయాలని ఇటీవల అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు అందాయి.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో 138 ఉద్యోగాలు... ఫిబ్రవరి 10 చివరి తేదీ

  DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Jobs: స్పోర్ట్స్ అథారిటీలో 347 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Central Government, Central govt employees, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railway employees, Railways, RRB, Staff Selection Commission, UPSC

  ఉత్తమ కథలు