Home /News /jobs /

CENTRAL GOVERNMENT JOB ALERT OF THIS WEEK TO JOB NOTIFICATIONS HERE ARE THE FULL DETAILS HERE VB

Government Jobs Alert: వివిధ విభాగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సిన పోస్టులు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Government Jobs Alert: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావాలనేది చాలా మందికి కల. ఇందుకోసం అభ్యర్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. వివిధ శాఖల పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి(Central Government Jobs) ఎంపిక కావాలనేది చాలా మందికి కల(Dream). ఇందుకోసం అభ్యర్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. వివిధ శాఖల పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్‌ను(Notification) కూడా విడుదల చేస్తుంది. ఇది దేశంలోని అభ్యర్థులకు ఉద్యోగం పొందడానికి అవకాశం ఇస్తుంది. ఈ వారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ముఖ్యమైన నోటిఫికేషన్‌ల జాబితా ఇక్కడ ఉంది. దీని ద్వారా.. అభ్యర్థులు ఏ పోస్ట్ కోసం దరఖాస్తు(Application) చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

One Nation-One Test: NEET, JEE, UGC విద్యార్థులకు అలర్ట్.. ఇక నుంచి ఒక్కటే పరీక్ష.. వివరాలిలా..


నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ..
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అసిస్టెంట్, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 48 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ,అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణ ఆఫ్‌లైన్ ద్వారా చేయవచ్చు . చివరి తేదీ ఆగస్టు 28గా పేర్కొన్నారు.



కన్సల్టెంట్ పోస్టులు..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని ఏ ప్రాంతంలో అయినా పనిచేయడానికి ఇష్టపడే అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తును సమర్పించవచ్చు. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 18.

RRB Group D Update: ఆర్ఆర్బీ గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. అందుబాటులోకి హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా..


నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌..
బెంగళూరులోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బిజినెస్ మేనేజర్, కాంట్రాక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను తాత్కాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 20.

Singareni Jobs For Sale: రండి బాబు రండి.. సింగరేణి జూనియర్ అసిస్టెట్ ఉద్యోగాలు అమ్మబడును..!


గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ..
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 189 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 11. పైన పేర్కొన్నా పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలకు ఆయా సంస్థ వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, JOBS, Private Jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు