Scholarship: విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్... వివరాలివే

Scholarship | మొదటిసారి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసేవాళ్లు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సరైన వివరాలతో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేయాలి. 18 ఏళ్ల లోపు విద్యార్థులైతే వారి తల్లిదండ్రులు ఈ ఫామ్ నింపాలి.

news18-telugu
Updated: July 21, 2019, 2:43 PM IST
Scholarship: విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్... వివరాలివే
Scholarship: విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రతిభ ఉన్నా చదువుకోవడానికి సరైన ఆర్థిక పరిస్థితులు లేక ఇబ్బందులు పడుతున్నవారికి శుభవార్త. ప్రతిభ గల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. యూనివర్సిటీ, కాలేజీ విద్యార్థులకు 'సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా విభాగం ఈ స్కాలర్‌షిప్స్ పథకాన్ని అమలు చేస్తోంది. 2019-20 విద్యాసంవత్సరానికి జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్ అయిన scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2019 అక్టోబర్ 31 చివరి తేదీ. ఫ్రెష్ లేదా రెన్యువల్ స్కాలర్‌షిప్స్ కోసం విద్యార్థులు scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్ పొందాలనుకునే విద్యార్థులు ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ఈ వివరాలు ఉంటాయి. స్కాలర్‌షిప్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే రాష్ట్ర విద్యామండలిలోని నోడల్ ఆఫీసర్ నుంచి సమాచారం తెలుసుకోవచ్చు. నోడల్ ఆఫీసర్ల వివరాలు కూడా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో 'Services' సెక్షన్‌లో ఉంటాయి. మొదటిసారి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసేవాళ్లు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సరైన వివరాలతో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేయాలి. 18 ఏళ్ల లోపు విద్యార్థులైతే వారి తల్లిదండ్రులు ఈ ఫామ్ నింపాలి.

స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థుల ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఆధార్ నెంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా బోనఫైడ్ లేదా బ్యాంక్ పాస్‌బుక్ లాంటి కాపీలు సిద్ధంగా ఉండాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:
Loading...
Metro Jobs: నోయిడా మెట్రోలో 199 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Bank Jobs: నైనిటాల్ బ్యాంకులో 230 క్లర్క్, పీఓ ఉద్యోగాలు

NYKS Jobs: నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో 337 ఉద్యోగాలు
First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com