Home /News /jobs /

CENTRAL GOVERNMENT CONSIDERING PARENTS OPPOSITION AND RETHINKING ON REOPENING OF SCHOOLS SS

Schools Reopen: స్కూళ్లు ఎప్పుడు తెరవాలి? కేంద్ర ప్రభుత్వం తాజా ఆలోచన ఇదే

Schools Reopen: స్కూళ్లు ఎప్పుడు తెరవాలి? కేంద్ర ప్రభుత్వం తాజా ఆలోచన ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Schools Reopen: స్కూళ్లు ఎప్పుడు తెరవాలి? కేంద్ర ప్రభుత్వం తాజా ఆలోచన ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Schools Reopen | భారత ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల్ని విడతల వారీగా సడలిస్తోంది. అయితే స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.

    భారతదేశంలో స్కూళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయి? కోట్లాది మంది సమాధానం వెతుకుతున్న ప్రశ్న ఇదే. త్వరలోనే స్కూళ్లు తెరుచుకుంటాయన్న వార్తలొస్తున్నాయి. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్న సమయంలో స్కూళ్లు తెరిస్తే తమ పిల్లల్ని పంపించలేమన్న అభిప్రాయమే మెజార్టీగా ఉంది. ఎక్కువ గ్యాప్ వస్తే చదువులో సమస్యలు వస్తాయన్న ఆందోళన ఉన్నా, తమ పిల్లలకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందన్న భయమే ఎక్కువగా ఉంది. స్కూళ్లు తెరిచినా తమ పిల్లల్ని పంపబోమని అనేక సర్వేల్లో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా తల్లిదండ్రుల్లో నెలకొన్న ఈ భయాలను, స్కూళ్ల రీఓపెన్‌పై ఉన్న వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. స్కూళ్లను తిరిగి తెరిచే ప్రతిపాదనలపై పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు తాజాగా వస్తున్నాయి.

    IBPS PO: డిగ్రీ పాసైనవారికి 1167 బ్యాంకు ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

    National Recruitment Agency: నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీతో నిరుద్యోగులకు లాభమిదే

    కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉండగానే అమెరికాలో పాఠశాలలు తెరవడం, స్కూళ్లు తెరిచిన మొదటి రెండువారాల్లోనే అనేక మంది విద్యార్థులు కోవిడ్ 19 బారిన పడటం లాంటి ఉదాహరణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో విద్యాసంస్థలు తెరిచినా తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపే అవకాశాలు చాలా తక్కువ. చదువు కన్నా పిల్లల ఆరోగ్యం, భద్రత తమకు ముఖ్యమని పేరెంట్స్ అసోసియేషన్లు ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అందుకే స్కూళ్ల రీఓపెన్‌పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచిస్తోంది. మరోవైపు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా స్కూళ్లను తెరవడం పెద్ద రిస్క్ అవుతుందని, ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వేర్వేరు మంత్రిత్వ శాఖలకు చెందిన గ్రూప్ ఆఫ్ సెక్రెటరీస్ స్కూళ్ల రీఓపెన్‌పై మరోసారి చర్చించనుంది.

    ఇక భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య చూస్తే 28,36,926 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 6,86,395. ఇప్పటివరకు 53,866 మంది మరణించారు. గత 24 గంటల్లో 69,652 కేసులు నమోదు కాగా, 977 మంది చనిపోయారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: AP Schools, Corona, Corona virus, Coronavirus, Covid-19, School admissions, Schools reopening, Telangana schools

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు