కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రకటించింది. అగ్నిపథ్ స్కీమ్‌ను (Agnipath Scheme) మంగళవారం ఆవిష్కరించింది. ఇది కేంద్ర సాయుధ బలగాల కోసం చేపడుతున్న రిక్రూట్‌మెంట్ స్కీమ్. డిఫెన్స్ బడ్జెట్ తగ్గించుకొని మరిన్ని ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ఇండియన్ ఆర్మీ (Indian Army), ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలగాలకు చెందిన అధినేతలు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీగా అగ్నివీర్‌లను (Agniveer) నియమించుకోనుంది.
రాబోయే 90 రోజుల్లోనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి బ్యాచ్ 2023 జూలై నాటికి సిద్ధం అవుతుంది. ఎంపికైనవారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. విద్యార్హతల విషయానికి వస్తే సాయుధ బలగాల్లో రెగ్యులర్‌గా జరిగే నియామకాలకు ఎలాంటి విద్యార్హతలు ఉంటాయో అగ్నివీర్ పోస్టులకు కూడా అవే అర్హతలు ఉంటాయి.
Govt Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాల భర్తీ... ప్రకటించిన ప్రధాని మోదీ
అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఎంపికయ్యేవారు అగ్నివీర్‌గా నాలుగేళ్లు మాత్రమే పనిచేస్తారు. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మొదట 45,000 మంది అగ్నివీర్‌లను నియమించుకోనుంది. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారిని మాత్రమే నియమించుకుంటారు. వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఇస్తారు. నాలుగేళ్ల కాల వ్యవధిలో ఆరు నెలల శిక్షణ కాలం కూడా కలిపే ఉంటుంది. అంటే మూడున్నరేళ్లు పనిచేయాల్సి ఉంటుంది.
To transform the Defence Services and enable Yuva Shakti in building an Aatmanirbhar and Sashakt Bharat, the government launches the Agnipath scheme. Here's everything you need to know! #BharatKeAgniveer pic.twitter.com/hhDbaLtZzJ
— MyGovIndia (@mygovindia) June 14, 2022
ఎంపికైన వారికి నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు స్టైపెండ్ లభిస్తుంది. అలవెన్సులు కూడా ఉంటాయి. మెడికల్, ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నాలుగేళ్లు పూర్తైన తర్వాత వీరిలో 25 శాతం మందిని రెగ్యులర్ కేడర్‌లో చేర్చుకుంటారు. రెగ్యులర్ కేడర్‌లో చేరినవారు 15 ఏళ్ల పాటు నాన్ ఆఫీసర్ ర్యాంక్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
Jobs in TCS: ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ చదివినవారికీ టీసీఎస్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
ఇక మిగతా 75 శాతం మందికి ఎగ్జిట్ అవకాశం కల్పిస్తారు. అంటే నాలుగేళ్లు పూర్తైన తర్వాత వారు ఈ ఉద్యోగం వదిలేయొచ్చు. ఎగ్జిట్ సమయంలో రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు సేవా నిధి ప్యాకేజీ, స్కిల్ సర్టిఫికెట్స్ లభిస్తాయి. వారికి ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ ఉండవు. అయితే ఆ తర్వాత మరో కెరీర్‌లో స్థిరపడేందుకు బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తాయి. ఈ స్కీమ్ ద్వారా డిఫెన్స్ వార్షిక ఖర్చులు బాగా తగ్గిపోతాయి. వార్షిక డిఫెన్స్ బడ్జెట్ రూ.5.2 లక్షల కోట్లకు తగ్గుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Scheme, Azadi Ka Amrit Mahotsav, Indian Air Force, Indian Army, Indian Navy, JOBS