Home /News /jobs /

CENTRAL FINANCE MINISTRY HOLD TO IBPS EXAMS THEY PLAN TO CONDUCT EXAMS IN REGIONAL LANGUAGES NGS

Bank Exams: బ్యాంక్‌ ఉద్యోగాల భర్తీకి కేంద్రం బ్రేక్‌, ఇక తెలుగులోనే ఎగ్జామ్‌..! సాధ్యమయ్యేనా..?

IBPS Clerk Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 5,830 పైగా క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

IBPS Clerk Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 5,830 పైగా క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

ఇకపై బ్యాంక్ క్లరికల్ ఉద్యోగాల పరీక్షలు ఎవరికి ఇష్టమైన లాంగ్వేజ్ లో వారు రాయొచ్చా..? అందుకే తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ను కేంద్రం ఆర్థిక శాఖ నిలుపుదల చేసిందా..? మరి పరీక్షలకు మళ్లీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు..

    తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతకు కేంద్ర ఆర్థిక శాఖ శుభవార్త  చెప్పింది.. ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్ కు కేంద్రం ఓకే చెప్పేందుకు సిద్ధమైంది..?  అందుకే తాజగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్‌ ఉద్యోగాల భర్తీకి బ్రేక్‌ పడింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు పరీక్షలను నిలుపుదల చేయాలంటూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌కు (ఐబీపీఎస్‌) ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఇంగ్లిష్, హిందీ భాషల్లో క్లరికల్‌ క్యాడర్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు ఐబీపీఎస్‌ ఇటీవల ప్రకటన వెలువరించింది. ఆన్ లైన్ లో అప్లికేషన్లు కూడా స్వీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఇంతలోనే కేంద్ర షాక్ ఇచ్చింది.. తాజా నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి.

    దేశ వ్యాప్తంగప్రభుత్వ బ్యాంకుల్లో 5,830 పైగా క్లర్క్ ఉద్యోగాల భర్తీకీ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల అయ్యింది. బ్యాంకింగ్ పర్సనల్-IBPS దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ క్లర్క్ 11 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,830 క్లర్క్ పోస్టులు ఉన్నాయి. 2022-23 సంవత్సరానికి భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 1 చివరి తేదీగా ప్రకటించింది కూడా.. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్. కానీ ఆ నోటిఫికేషన్ కు కేంద్రం బ్రేక్ లు వేసింది.

    ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ కేడర్‌కు ప్రాంతీయ భాషల్లో టెస్ట్‌ నిర్వహించాలన్న డిమాండ్‌ను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ కమిటీ తన సిఫార్సులను 15 రోజుల్లో ఇస్తుంది. ఈ సిఫార్సులు అందుబాటులోకి వచ్చే వరకు పరీక్షను నిలిపివేస్తున్నాం అని వెల్లడించింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు పెట్టాలన్న డిమాండ్‌ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వెల్లువెత్తుతోంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగాల భర్తీకి ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్‌ నిర్వహించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ 2019 జూలైలో పార్లమెంటులో స్పష్టం చేసింది. ఆ హామీ మేరకే తాజా ఆదేశాలు వెలువడినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలుగులోనే పరీక్షలు నిర్వహించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. తాజా ఆదేశాలు నేపథ్యంలో త్వరలో తెలుగులోనే ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఏర్పాడింది. అయితే దీనిపై ఇంకా కేంద్రం స్ష్టష్టమైన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది..
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Bank Jobs 2021, IBPS

    తదుపరి వార్తలు