హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Advanced 2021 Dates: ఆ విద్యార్థులకు అలర్ట్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

JEE Advanced 2021 Dates: ఆ విద్యార్థులకు అలర్ట్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల తేదీలపై జనవరి 7న స్పష్టమైన ప్రకటన రానుంది. ఈ పరీక్షల తేదీలను జనవరి 7న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ వెల్లడించనున్నారు.

ఇంకా చదవండి ...

  కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం అంతా గందరగోళంగా సాగుతోంది. ఏ అడ్మిషన్లు ఎప్పుడు ఉంటాయి? ఏ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారు? ఫలితాలను విడుదల చేస్తారు అన్న ప్రతీ అంశం చివరిదాక అయోమయంగానే ఉంటోంది. అయితే.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల తేదీలపై జనవరి 7న స్పష్టమైన ప్రకటన రానుంది. ఈ పరీక్షల తేదీలను జనవరి 7 సాయంత్రం 6 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ వెల్లడించనున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ఈ గురువారం(జనవరి 7న) ఆ ట్విటర్‌ ద్వారా విద్యార్థులతో సమావేశం నిర్వహించనున్నారు.

  ఈ సమావేశంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల తేదీలను, ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే జేఈఈ మేయిన్‌-2021 పరీక్ష వచ్చే నెల 23 నుంచి 26 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 16ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Jee, JEE Main 2021

  ఉత్తమ కథలు