Home /News /jobs /

CENTRAL BOARD OF SECONDARY EDUCATION TO TAKE DECISION ON EXAMINATIONS BY THURSDAY CBSE INFORMED TO SUPREME COURT SS

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల రద్దుపై నిర్ణయం ఎప్పుడంటే...

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల రద్దుపై నిర్ణయం ఎప్పుడంటే...
(ప్రతీకాత్మక చిత్రం)

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల రద్దుపై నిర్ణయం ఎప్పుడంటే... (ప్రతీకాత్మక చిత్రం)

CBSE Exams | సీబీఎస్ఈ పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పరీక్షల రద్దుపై ఎప్పట్లోగా నిర్ణయం తీసుకుంటామో సుప్రీం కోర్టుకు తెలిపింది సీబీఎస్ఈ.

    సీబీఎస్‌ఈ పెండింగ్ పరీక్షలు ఉంటాయా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. పెండింగ్ పరీక్షల్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనపై చర్చలు తుది దశకు వచ్చాయని, గురువారం లోగా నిర్ణయం తీసుకుంటామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE మంగళవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయాలని, పరీక్షలు మిగిలిన సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలంటూ సుప్రీం కోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 250 పాఠశాలల్లో క్లాస్ 10, 12 పరీక్షల్ని రద్దు చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా సీబీఎస్ఈ మార్కులు వేసిందని, అందరు విద్యార్థులకు అలాగే మార్కులు వేయాలని పేరెంట్స్ కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. సీబీఎస్‌ఈ పెండింగ్ పరీక్షలపై గురువారం లోగా నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్ఈ తరఫున సోలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు.

    జూలై 1 నుంచి జూలై 15 వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది సీబీఎస్ఈ. అంతేకాదు జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్ 2020, జూలై 26న నీట్ యూజీ 2020 పరీక్షలకు కూడా షెడ్యూల్ విడుదలైంది. విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్ వేయడంతో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది. సీబీఎస్ఈ పరీక్షల్ని రద్దు చేసినా నీట్ యూజీ 2020, జేఈఈ మెయిన్ 2020 పరీక్షల్ని తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరీక్షల ద్వారానే దేశంలోని వేర్వేరు కాలేజీలు, యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుంది. లక్షలాది మంచి విద్యార్థుల భవిష్యత్తు ఈ పరీక్షలపై ఆధారపడి ఉంది.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Govt Jobs: టెన్త్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి

    Govt Jobs: ఇంటర్ పాసయ్యారా? ఈ 669 ఉద్యోగాలకు అప్లై చేయండి

    TS Inter Results 2020: మార్కులు తక్కువగా వస్తే... రీకౌంటింగ్ చేయించండి ఇలా
    First published:

    Tags: CAREER, CBSE, Corona, Corona virus, Coronavirus, Covid-19, EDUCATION, Exams, JEE Main 2020, Lockdown, NEET 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు